తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ ను నిరసిస్తూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన బీజేపీ కార్యకర్త గంగుల శ్రీనివాస్ కొద్దిసేపటి క్రితం మృతిచెందినట్టు తెలిసింది. ఈ మేరకు మీడియాలో వార్తలు వస్తున్నాయి.
దుబ్బాక ఎన్నికల ప్రచారం ఆఖరు రోజున బండి సంజయ్ అరెస్ట్ ను నిరసిస్తూ హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయం ముందు శ్రీనివాస్ ఒంటికి నిప్పంటించుకున్నాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకొని నవంబర్ 1 ఆత్మహత్యాయత్నం చేశాడు. చుట్టూ ఉన్న కార్యకర్తలు తక్షణం స్పందించి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి నగరంలోని యశోదా ఆస్పత్రికి తరలించారు.
44శాతం కాలిన గాయాలతో శ్రీనివాస్ ఆస్పత్రిలో చేరాడు. సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలోనే కేంద్రహోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సహా లక్ష్మణ్, రాంచంద్రారెడ్డి, ప్రేమేందర్ రెడ్డి తదితరులు వచ్చి పరామర్శించారు. శ్రీనివాస్ కు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు.
అయినప్పటికీ పరిస్థితి విషమించడంతో గురువారం శ్రీనివాస్ మృతిచెందాడు. ఈ ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, నేతలు తీవ్ర విచారణం వ్యక్తం చేశారు.