ఆశే మనిషిని నడిస్తుంటుంది. టార్గెట్ చేస్తున్న ఒక్కొక్క రాష్ట్రాన్ని కైవసం చేసుకొని ముందుకెళుతున్న కమలనాథులు మాంచి ఉత్సాహంతో ఉన్నారు. తాము గురి పెట్టాలే కానీ.. సాధించలేనిది ఏమీ లేదన్నట్లుగా ఫీలైపోతున్నారు. తాజాగా వారి కన్ను తెలంగాణ మీద పడింది. మోడీ ఇమేజ్ కారణంగా.. గతంలో ఎప్పుడూ లేనంత భారీగా పార్టీ విస్తరిస్తున్న వేళ.. ఇప్పుడుకాకుంటే ఎప్పటికీ కాదన్న రీతిలో వారు తెలంగాణ రాష్ట్రాన్ని కైవసం చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను తేలిగ్గా ఎదుర్కోగలమన్న నమ్మకాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో కాషాయ జెండా రెపరెపలాడాలని తపిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రణాళికల్ని రూపొందించి మరీ కేసీఆర్ దూకుడుకు కళ్లెం వేయాలని భావిస్తున్నారు. అంతా బాగానేఉన్నా.. తమ కలల సాకారానికి తమ దగ్గరున్న వ్యూహాన్ని వారు ప్రదర్శించే విషయంలో విఫలమవుతున్నారు.
అక్కడెక్కడో కూర్చున్న మోడీ గాలి తెలంగాణలో బ్రహ్మండంగా వీస్తుందని.. ఆయన పేరు చెప్పినంతనే తెలంగాణలో ఓట్లు రాలతాయన్నట్లుగా కమలనాథుల ఆలోచనలు సాగుతున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లాలో లోక్ సభా నియోజకవర్గ స్తాయి పోలింగ్ బూత్ కమిటీ సదస్సులో మాట్లాడిన కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ.. తెలంగాణలో 2019 ఎన్నికల్లో బీజేపీ ఎగరవేయటం ఖాయమన్న ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించారు.
తెలంగాణలో అంతర్లీనంగా మోడీ గాలి వీస్తుందని.. అందుదకు ఎన్డీయే చేపట్టిన పథకాలు.. విధానాలే కారణంగా చెప్పుకొచ్చారు. ఒకవేళ అదే నిజమైతే.. అలాంటివి మచ్చుకు నాలుగైదు ప్రస్తావించొచ్చు కదా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. గాలి వీస్తుందని చెబుతున్న కమలనాథులు.. ఆ గాలి ఎలా ఉంది? తెలంగాణ ప్రజల మీద దాని ప్రభావం ఎంతన్న విషయాన్ని చెప్పే విషయంలో తడబాటుకు గురి కావటం కనిపిస్తుంది.
అరిగిపోయిన గ్రాంఫోన్‌రికార్డు మాదిరి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అదే పనిగా ప్రస్తావించే బీజేపీ నేతలు.. ఆ ఇష్యూ మీద వారికున్న కమిట్ మెంట్ ఏమిటన్నది పెద్ద ప్రశ్న. కేంద్రంలో కొలువు తీరిన వేళ.. తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవాన్నిటీఆర్ ఎస్ సర్కారు ఎందుకునిర్వహించటం లేదన్న సూటి ప్రశ్నకు ఇప్పటివరకూ కమలనాథులు నేరుగా సమాధానం చెప్పని పరిస్థితి.
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించే విషయంలో తెలంగాణ రాష్ట్ర అధికారపక్షం చేస్తున్న తప్పును అప్పుడప్పుడు ఎత్తి చూపే కన్నా.. ఈ ఇష్యూలో తెలంగాణ అధికారపక్షం డిఫెన్స్ లో పడేలా కార్యక్రమాన్ని ఎందుకు చేపట్టలేరన్నది ప్రశ్న. అంతేకాదు.. మోడీ గాలి తెలంగాణలో వీస్తుందన్న మాటను చెబుతున్న టీ బీజేపీ నేతలు.. అదెలానన్నవిషయాన్ని అందరికి అర్థమయ్యేలా చెబితే బాగుంటుందని చెప్పక తప్పదు. లేనిపక్షంలో ఏదో మాటల హడావుడే తప్ప.. నిజంగా అంత సీన్ ఉందన్న నమ్మకం తెలంగాణ ప్రజలకు కలగదన్నవిషయాన్నిగుర్తిస్తే మంచిది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/