బీజేపీని వదల్లేక - పట్టుకుని వేలాడలేక తెలుగుదేశం పార్టీ గోడ మీద పిల్లి రాజకీయాలు చేస్తోంది. అయితే.. ఎన్డీయే చరిత్రను పరిశీలిస్తే కూటమిలోని అనేక పార్టీలతో బీజేపీ నమ్మకమైన స్నేహం కొనసాగించలేదనే అర్థమవుతోంది. కొన్ని మాత్రమే బీజేపీతో అత్యంత నమ్మకంగా సాగగలుగుతున్నాయి. దేశంలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతూ వచ్చిన భారతీయ జనతా పార్టీ రాష్ట్రాల్లోని ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా అది ఎక్కువ కాలం కొనసాగిన దాఖలాలు లేవు.
తమ పార్టీ పునాదులు వేయడానికో లేదంటే.. అంతోఇంతో ప్రాతినిధ్యం ఉన్న చోట మరింతగా విస్తరించడానికో స్థానిక పార్టీలను బీజేపీ ఉపయోగించుకున్నంతగా ఇంకే జాతీయ పార్టీ ఉపయోగించుకోలేదు. అయితే.. అదేసమయంలో తెలివైన ప్రాంతీయ పార్టీలు బీజేపీ చేతిని ఎప్పుడు వదిలేయాలో అప్పుడు వదిలేశాయి. లేదంటే తాము కనుమరుగైపోవడం ఖాయమని గుర్తించాయి. అలా బీజేపీని వదిలించుకున్న పార్టీలు కొన్ని బలమైన శక్తులుగా ఎదగగా.. మరికొన్ని ఒకసారి విడిచిపెట్టినా మళ్లీ జతకట్టాయి. అలా తిరిగి జత కట్టిన పార్టీల్లో తెలుగుదేశం కూడా ఒకటి.
బీజేపీ ఎన్డీయేలోని కొన్ని పార్టీలను ఎలా మింగేసింది.. అలాగే పలు పార్టీలు బీజేపీని ఎలా వదిలించుకున్నాయి.. అందుకు దారి తీసిన పరిస్థితులు - సందర్భాలు ఏంటన్నది చూద్దాం. బీజేపీని విడిచిపెట్టిన పార్టీల్లో చాలావరకు ఆయా రాష్ర్టాల్లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ పనిచేశాయి. దీంతో టీడీపీ కూడా ఎన్నికలు వచ్చేనాటికి బీజేపీని వదిలేస్తుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి.
* అన్నాడీఎంకే.. తమిళనాడులో జయలలిత నేతృత్వంలోని ఈ పార్టీ గతంలో ఎన్డీయేలో ఉన్నప్పటికీ 1999 ఎన్నికల సమయంలో పొత్తు తెంచుకుని కాంగ్రెస్ పక్షాన చేరింది.
* లోక్ శక్తి... బీహార్లోని ఈ పార్టీ 1999 ఎన్నికల సమయంలో జేడీ(యూ)లో కలిసిపోయింది. 1990ల్లో జనతాదళ్ చీలినప్పుడు రామకృష్ణ హెగ్డే ఈ పార్టీని ఏర్పాటుచేశారు. కర్ణాటకలో కొద్దికాలం ప్రభావవంతంగా ఉంది. ఎన్డీయే వ్యవస్థాపక పార్టీల్లో ఇది కూడా ఒకటి.
* నేషనల్ కాన్ఫరెన్స్.. ఫరూక్ అబ్దుల్లాకు చెందిన ఈ పార్టీ 2002లో జమ్ముకశ్మీర్ లో ఓటమి పాలైనప్పుడు ఎన్డీయే నుంచి బయటకొచ్చేసింది. బీజేపీ కారణంగానే ఓడిపోయామంటూ పొత్తు తెంచుకుంది.
* సమతా పార్టీ... జార్జిఫెర్నాండెజ్ నేతృత్వంలోని ఈ పార్టీ 2003లో జేడీయూతో కలిసిపోయింది.
*డీఎంకే.. 1999లో అన్నాడీఎంకే ఎన్డీయే నుంచి బయటకొచ్చేశాక డీఎంకే అందులో చేరింది. కానీ.. 2004 ఎన్నికలప్పుడు ఆ పార్టీకూడా ఎన్డీయే నుంచి బయటకొచ్చి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏలో కలిసింది.
* హర్యాణా వికాస్ పార్టీ.. 2004 ఎన్నికలప్పుడు బీజేపీని వదిలేసి కాంగ్రెస్ తో కలిసింది.
* ఇండియన్ ఫెడరల్ డెమొక్రటిక్ పార్టీ.. కేరళకు చెందిన ఈ పార్టీ 2004 ఎన్నికలప్పుడు కేరళ కాంగ్రెస్ లో కలిసిపోయింది.
* తృణమూల్ కాంగ్రెస్.. 2007లో బీజేపీతో పొత్తును తెంచుకుంది.
* ఇండయన్ నేషనల్ లోక్ దళ్.. హరియాణాకు చెందిన ఈ పార్టీ 2009లో అక్కడి అసెంబ్లీ ఎన్నికలప్పుడు సీట్ల సర్దుబాట్లు కుదరక బీజేపీని వదిలేసింది.
* బిజూ జనతాదళ్.. 2009ఎన్నికలకు నెల రోజుల ముందు బీజేపీని వదిలేసింది. కొంధమాల్ లో లక్ష్మణానంద సరస్వతి హత్య తరువాత జరిగిన అల్లర్లనేపథ్యంలో బీజేడీ బీజేపీని వదిలించుకుంది. అది మొదలు ఆ పార్టీ ప్రతి ఎన్నికల్లో మరింత బలపడుతూ వస్తోంది. ప్రస్తుతం ఒడిశాను ఎలాగైనా కైవసం చేసుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది.
* టీఆరెస్... 2009 ఎన్నికల్లో ఓటమి తరువాత బీజేపీని వదిలేసింది.
* జేడీ(ఎస్).. కర్ణాటకలో దేవగౌడకు చెందిన ఈ పార్టీ 2010లో ఎన్డీయేను వదిలేసింది.
* లదాఖ్ యూనియన్ టెరిటరీ ఫ్రంట్... జమ్ముకశ్మీర్లోని ఈ పార్టీ ని బీజేపీ 2010లో తనలో కలిపేసుకుంది.
*కామ్తాపూర్ ప్రొగ్రెసివ్ పార్టీ... వెస్టుబెంగాల్లోని ఈ పార్టీ 2010లో కామ్తాపూర్ పీపుల్స్ పార్టీలో కలిసిపోయింది. దీంతో ఎన్డీయే నుంచి వైదొలగింది.
* ఉత్తరాఖండ్ క్రాంతిదళ్.. 2012లో ఆ రాష్ట్ర ఎన్నికలప్పుడు బీజేపీతో పొత్తు తెంచుకుంది.
* రాష్ర్టీయ లోక్ దళ్.. ఉత్తరప్రదేశ్ లో అజిత్ సింగ్ కు చెందిన ఈ పార్టీ 2012లో యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీని వదిలి కాంగ్రెస్ తో కలిసింది.
* జార్ఖండ్ ముక్తి మోర్చా.. శిబూసోరేన్ కు చెందిన ఈ పార్టీ 2012లో కమలానికి దూరమైంది.
*జనతా పార్టీ.. తమిళనాడులో సుబ్రహ్మణ్య స్వామికి చెందిన ఈపార్టీ బీజేపీలో కలిసిపోయింది.
* హర్యాణా జనహిత కాంగ్రెస్.. 2014లో హరియాణా ఎన్నికలకు ముందు ఎన్డీయే నుంచి వైదొలగింది.
*ఎండీఎంకే... 2016 తమిళనాడు ఎన్నికలకు ముందు బీజేపీకి దూరమైంది.
* కేరళ నేషనలిస్ట్ కాంగ్రెస్(నోబుల్ మాథ్యూ వర్గం).. 2016లో ఈ పార్టీని బీజేపీ తనలో కలిపేసుకుంది.
* డీఎండీకే.. హీరో విజయ్ కాంత్ స్థాపించిన ఈ పార్టీ 2016 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు పొత్తు తెంచుకుంది.
*కేరళ జనపక్షం.. 2016లో బీజేపీలో కలిసిపోయింది.
* రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ ఆఫ్ కేరళ.. 2016 కేరళ అసెంబ్లీ ఎన్నికలకు ముందు పొత్తు వదులుకుంది.
*మారాలాండ్ డెమొక్రటిక్ ఫ్రంట్.. మిజోరాంలోని ఈ పక్షం 2017లో బీజేపీలో కలిసిపోయింది.
*స్వాభిమాన్ పక్ష్.. ఎంపీ రాజు శెట్టి నేతృత్వంలోని ఈ పార్టీ మహారాష్ర్టకు చెందిన ఈ పార్టీ 2017లో బీజేపీతో బంధం తెంచుకుంది.