-నీకూ నీ వాడు లేడు - నాకూ నావాడు లేడు..అన్నట్టుగా ఉంది కాంగ్రెస్ పార్టీ - భారతీయ జనతా పార్టీల పరిస్థితి. పోలింగ్ వేళ కూడా ఆ పార్టీల స్థితిగతుల్లో ఎలాంటి మార్పు చేర్పులు లేవు!
-ఏపీ వ్యాప్తంగా ఎక్కడా బీజేపీ గెలిచే సీటు అంటూ ఒక్కటి కూడా లేదని తేలిపోతోంది. బీజేపీ వాళ్లకు జాతీయ స్థాయిలో అధికారం ఉన్నా - ప్రధాని మోడీ ప్రచారానికి వచ్చినా కనీసం ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఆ పార్టీ గెలిచే పరిస్థితి కనిపించడం లేదు.
-బీజేపీ సిట్టింగులంతా దాదాపుగా ఎదురుదీతుతున్నారు.ఇక మెజారిటీ నియోజకవర్గాల్లో బీజేపీ ప్రచారం నామమాత్రంగా సాగుతూ ఉంది.
-బీజేపీ రెండు శాతం ఓట్లను సంపాదించవచ్చని సర్వేలు అంచనా వేస్తున్నాయి. అయితే ఆ శాతంతో సాధించేది ఏమీ లేదని స్పష్టం అవుతోంది.
-ఇక కమలం పార్టీతో తీసిపోని రీతిలో ఉంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. కమలం పార్టీ కన్నా కాంగ్రెస్ సాధించే ఓట్ల శాతం తక్కువగానే ఉంది. ఒకటిన్నర శాతం వరకూ కాంగ్రెస్ పార్టీ ఓట్లను పొందవచ్చని అంచనా.
-కాంగ్రెస్ ఎక్కడైనా కాస్తో కూస్తో పోటీలో ఉందంటే అది కల్యాణదుర్గం నుంచి మాత్రమే. పీసీసీ చీఫ్ రఘువీర అక్కడ పోటీ చేస్తూ ఉన్నారు. అయితే ఆయన విజయం పై నమ్మకాలు లేవు. ఓట్లను చీల్చడం మాత్రం ఖాయం. తద్వారా ఎవరికి లబ్ధి చేకూరుస్తారు? అనేదే ప్రశ్న.
-ఓవరాల్ గా ఆఖరి నిమిషంలో కూడా బీజేపీ - కాంగ్రెస్ పార్టీలు పొడిచేది ఏమీ లేకుండా పోయింది. రెండు జాతీయ పార్టీలూ ఏపీ వరకూ కేవలం డమ్మీలుగానే ఉన్నాయి. వారు సాధించే ఒకటీ రెండు శాతం ఓటు బ్యాంకు ఫలితాలను ఏ మేరకు మారుస్తుందో ఫలితాల నాటికి క్లారిటీ వస్తుంది.అప్పుడు ఈ ఎన్నికలపై వీళ్ల ప్రభావం ఏమిటో తెలుస్తుంది!