అమరావతి పై ఉద్యమం.. బరిలోకి జనసేన-బీజేపీ

Update: 2020-02-01 16:30 GMT
ఏపీకి 3 రాజధానుల ప్రకటన చేసినప్పటి నుంచి అమరావతి రగిలిపోతోంది. రాజధానికి భూములిచ్చిన రైతులంతా రోడ్డెక్కుతున్నారు. ఇటీవలే పొత్తు పెట్టుకున్న బీజేపీ - జనసేనలు సైతం ఇప్పుడు అమరావతి పోరుబాటను కొత్త పుంతలు తొక్కించేందుకు  సిద్ధమయ్యారు.

జనసేన - బీజేపీ రెండుపార్టీల నేతలు ఆదివారం అమరావతిలో పర్యటనకు ముహూర్తం పెట్టుకున్నారు. రాజధాని గ్రామాల్లో పర్యటించి ఆందోళన కొనసాగిస్తున్న వారికి మద్దతు తెలిపి వారికి సంఘీభావంగా పోరాడాలని నిర్ణయించారు.

అమరావతి విషయంలో జనసేన - బీజేపీ రెండు పార్టీలు ఉమ్మడి కార్యాచరణతో ముందుకెళ్లాలని డిసైడ్ అయ్యాయి. ఇరు పార్టీల నేతలు తాజాగా భేటి అయ్యి దీనిపై పోరాడేందుకు కార్యాచరణ మొదలు పెట్టారు.

కార్యాచరణలో భాగంగా మొదట రాజధాని రైతులను, ప్రజలను కలిసి వారికి సంఘీభావం తెలుపుతారు. అమరావతి ఏరియాలో పర్యటించి వారి సమస్యలు తెలుసుకొని ఉమ్మడిగా పోరుబాటకు శ్రీకారం చుడుతాయి. ఆదివారం నుంచే జనసేన - బీజేపీ పోరాటం అమరావతిపై మొదలు కానుంది.
Tags:    

Similar News