రాజకీయాల్లోకి రాను అని చిరంజీవి చెప్పినా ... ?
మెగాస్టార్ చిరంజీవికి సినీ సీమలో అపరిమితమైన ఇమేజ్ ఉంది. ఆయన మధ్యలో రాజకీయాల్లోకి వెళ్లి వచ్చారు.
మెగాస్టార్ చిరంజీవికి సినీ సీమలో అపరిమితమైన ఇమేజ్ ఉంది. ఆయన మధ్యలో రాజకీయాల్లోకి వెళ్లి వచ్చారు. ఆయన కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఇక ఈ రాజకీయాలు వద్దు అనుకున్నారు. గత పదేళ్లుగా ఆయన తన సినీ వ్యాపకాల్లోనే బిజీగా ఉంటున్నారు. ఆ మధ్యన ఇంటర్వ్యూలలో కూడా ఆయన ఇదే విషయం చెప్పారు. తాను రాజకీయాల్లోకి రాను అని. అయితే చిరంజీవిని రాజకీయాలు మాత్రం వదలడంలేదు. అవి ఆయనను వెంటాడుతున్నాయి.
మెగాస్టార్ గా టాలీవుడ్ పెద్దగా ఉన్న చిరంజీవిని రాజకీయ ప్రముఖులు కలవడం సహజం. వారితో కలసి ఆయన నేక కార్యక్రమాలలో పాలుపంచుకోవడం కూడా సహజం. అయితే బోడి గుండుకూ మోకాలికి ముడిపెట్టి అదిగో చిరంజీవి రాజకీయాల్లోకి వస్తున్నారు ఇదిగో ఈపార్టీలో చేరుతున్నారు అని ప్రచారం చేయడం ఎపుడూ జరుగుతూనే ఉంది.
ఇపుడు అది మరి కాస్తా ఎక్కువైంది. ఈసారి చిరంజీవిని ఏకంగా కేంద్ర మంత్రిగా చేసేశారు. ఇక ఆయనకు శాఖలు కేటాయించడమే తరువాయి అన్నట్లుగా వార్తలు వండి వార్చేశాయి. ఇంతకీ చిరంజీవిని ఏ పార్టీలో చేర్చారు అంటే బీజేపీలోనే. బీజేపీలో చిరంజీవి తొందరలో చేరబోతున్నారు అని లేటెస్ట్ గా వార్తలు షికార్లు చేస్తున్నాయి.
ఆయన ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటుగా ఢిల్లీలో ప్రధాని మోడీతో కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతే ఇక మెగాస్టార్ బీజేపీ తీర్ధం పుచ్చుకోవడం కన్ ఫర్మ్ అయింది అని చెప్పేస్తున్నారు. చిరంజీవి బీజేపీ పాల్గొనే కార్యక్రమాలలోనే ఎక్కువగా పాల్గొంటున్నారు అని కూడా చూపిస్తున్నారు.
అంతే చిరు పొలిటికల్ రీ ఎంట్రీ ఖయమని చెబుతున్నారు. చిరంజీవిని బీజేపీలో చేర్చుకుని తెలంగాణాలో వచ్చే ఎన్నికల్లో ఆయన చేత ప్రచారం చేయించుకుని లబ్ది పొందాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు అని ప్రచారం కూడా చేస్తున్నారు. ఎటూ తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన బీజేపీతో దోస్తీలో ఉంది కనుక చిరంజీవిని బీజేపీలో చేర్చుకుంటే అటు తెలంగాణా ఇటు ఏపీలో రాజకీయ లాభం సొంతమవుతుందని భావిస్తోంది అని ప్రచారం చేస్తున్నారు.
ఇలా చిరంజీవి గురించి అన్నీ రాస్తున్న వారు ఇంకా ఆయన రెస్పాన్స్ లేదని కూడా కొస మెరుపు మెరిపిస్తున్నారు. అయితే చిరంజీవి రాజకీయాల్లోకి రారు అన్నది అందరికీ తెలుసు అంటున్నారు. ఆయనకు పదవులు అవీ అంత మోజు మక్కువని ఇచ్చేవి కావని చెబుతున్నారు. ఆయన సినిమాలలోనే మరింత కాలం రాణించాలని చూస్తున్నారు అని అంటున్నారు. ఆయన సినీ రంగంలోనే ఉండాలని గట్టిగా కోరుకుంటూంటే చిరంజీవి పొలిటికల్ గా రీ ఎంట్రీ అని వార్తలు తరచూ రాస్తున్నారు.
పైగా చిరంజీవి వివరణ ఇవ్వాలని ఇస్తారని కూడా ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రతీ సారి ఇలాంటి వార్తలు రావడంతో చిరంజీవి ఎందుకు వివరణ ఇస్తారని అంటున్న వారూ ఉన్నారు. మొదటి సారి ప్రచారం చేస్తే సీరియస్ నెస్ ఎక్కువగా ఉంటుందని కానీ పదే పదే ఇదే రకమైన ప్రచారం చేయడం వల్ల ఏముందని అంటున్నారు.
అందువల్ల చిరంజీవి ఎప్పటి మాదిరిగానే సైలెంట్ గానే ఉంటారని అంటున్నారు. చిరంజీవి రాజకీయాల్లోకి రారు అన్నది మాత్రం ఎక్కువ మంది అంగీకరిస్తున్న విషయం. అలా కాదు అని ఆయన రాజకీయాల్లోకి వస్తే మాత్రం అది అతి పెద్ద అద్భుతం అవుతుంది అని అంటున్నారు. చూడాలి మరి చిరంజీవి అలాంటి అద్భు తానికి ఆస్కారం ఇస్తారా లేక సైలెంట్ గా ఉంటారా అన్నది.