నితీశ్‌ పై చంద్రబాబు ఆశలు గల్లంతు..

Update: 2018-12-22 07:27 GMT
వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే మోదీని ప్రధాని పీఠం నుంచి దించాలన్నది చంద్రబాబు విశ్వ ప్రయత్నం. దీనికోసం ఆయన లేని వాపును కూడా బలుపుగా చూపించి ఆంధ్రలో తనకు అలవాటైన పొలిటికల్ ఫార్ములాలు ప్రయోగించినా పెద్దగా వర్కవుట్ కాలేదు. అసలు - ఆయన్ను దేశంలోని నేతలెవరూ నమ్ముతున్న పరిస్థితి లేదు. పాపం.. చంద్రబాబు ఈసారి నితీశ్ కుమార్‌ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆయనొక్కరు ఎన్డీయే నుంచి బయటకొస్తే ఆయన్ను చూపించి ఎన్డీయేను ఇంకా చీల్చొచ్చని అనుకున్నారు.. కానీ, నితీశ్ మాత్రం బీజేపీతో సీట్ల సర్దుబాటు లెక్కల వరకు వచ్చేశారు. దీంతో చంద్రబాబు భారీ షాక్‌ లో ఉన్నారట.
   
ఎన్డీయే కూటమిలోని ఒక పార్టీ బయకొచ్చి తమతో కలుస్తుందంటూ చంద్రబాబు కొద్దిరోజులుగా ఊరిస్తున్నారు. నితీశ్ బయకొచ్చేస్తారన్న ఉద్దేశంతో ఆయన ఇలా గేమ్ ప్లాన్ చేసినా నితీశ్ మాత్రం ఆయన ఆశలు నెరవేర్చలేదు. అంతేకాదు.. ఈ రోజు బీజేపీ - నితీశ్ పార్టీ జేడీయూ - రాం విలాస్ పాశ్వాన్  పార్టీ ఎల్జేపీ మధ్య సీట్ల సర్దుబాటూ జరుగుతుందని సమాచారం. బీజేపీ 18 లోక్ సభ సీట్లు - జేడీయూ 17 - ఎల్జేపీ 5 సీట్లలో పోటీ చేసేలా ఇప్పటికే ఒప్పందం కుదిరిందని.. కేవలం ప్రకటన ఒక్కటే తరువాయని తెలుస్తోంది. ఈ సంగతి తెలిసినప్పటి నుంచి చంద్రబాబు గుండె చెరువైపోయిందట.
   
నితీశ్ పట్ల దేశ రాజకీయాల్లో ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. చంద్రబాబుతో ఆయనకు మంచి పరిచయాలే ఉన్న మాట వాస్తవమే. కానీ, ఇప్పుడాయన బీజేపీకి మంచి మిత్రుడు. ఒకప్పుడు ఆయన మోదీ సారథ్యాన్ని వ్యతిరేకించి కాంగ్రెస్‌ తో కలిసి సాగినా ఆ తరువాత ఎన్డీయేలో చేరారు. ఇటీవల చంద్రబాబు - కాంగ్రెస్‌ తో కలిసిన తరువాత ఆయన మార్కు ప్రత్యేక ప్రచారం మీడియాలో కనిపించడం ప్రారంభమైంది. అందులో భాగమే నితీశ్ ఎన్డీయే నుంచి వచ్చేస్తారన్న ప్రచారం. కానీ, ఇప్పుడు వాళ్ల సీట్ల పంపకం కూడా కొలిక్కి వచ్చింది. నితీశ్ రాకుండా చిన్నాచితకా పార్టీలు - నేతలను చంద్రబాబు యూపీఏలోకి తేగలిగినా అది వృథా ప్రయత్నమే తప్ప ఇంకేమీ కాదు.
Tags:    

Similar News