ఉప రాష్ట్రపతి : మమత ఇలాకా నుంచే...

Update: 2022-07-16 15:11 GMT
దేశానికి కొత్త రాష్ట్రపతిగా పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్ కర్ పేరుని బీజేపీ ప్రతిపాదించింది. తమ పార్టీ అభ్యర్ధిగా ఆయనను నిర్ణయించింది.

ఇంతకీ ఈ జగదీప్ ధన్ కర్ నే ఎందుకు అంటే ఆయన బెంగాల్ గవర్నర్ గా ఉన్నారు. మమతా బెనర్జీని ఢీ కొట్టిన గవర్నర్ గా ఆయన పేరే ముందు చెప్పుకోవాలి.

ఇపుడు అదే వరసలో మిగిలిన గవర్నర్లు కొందరు ఉత్సాహం చూపిస్తున్నారు. ఒక కేంద్రానికి ప్రత్యేకించి బీజేపీకి ఆయన బాగా సన్నిహితంగా మెలిగారు. తనకు అప్పగించిన బాధ్యతలను ఒక అపోజిషన్ పార్టీ పవర్ లో ఉన్న రాష్ట్రానికి చెందిన గవర్నర్ గా ఆయన తుచ తప్పకుండా నెరవేర్చారు. దాంతో ఆయన పేరుని ఎంపిక చేశారు అని తెలుస్తోంది.

ఇక ఆయన రాజకీయంగా కూడా గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. రాజస్థాన్ రాష్త్రానికి చెందిన ఆయన పూర్వాశ్రమంలో న్యాయవాదిగా కూడా పనిచేశారు. ఇక 1989లో జనతాదళ్ నుంచి ఎంపీ అయిన ఆయన కొన్నాళ్ళ పాటు ప్రభుత్వంలో ఉన్నారు. 2003లో బీజేపీలో చేరిన ఆయన నాటి నుంచి పార్టీకి బద్ధుడిగా ఉన్నారు.

ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి ఆయన బెంగాల్ లో రాజకీయంగా కూడా కావల్సిన ఫోకస్ ని తెచ్చుకున్నారు. మొత్తానికి అన్నీ కలసి ఆయన్ని ఉప రాష్ట్రపతిగా ప్రతిపాదించనున్నాయి.

మరి మమతా బెనర్జీ గవర్నర్ తో నిత్యం లడాయి పెట్టుకుంటారు. అలాంటి జగదీప్ ధనకర్ ఉప రాష్ట్రపతి అభ్యర్ధి అయితే విపక్ష శిబిరం నుంచి కూడా ధీటైన అభ్యర్ధిని ఆమె ప్రతిపాదించకమానదు అని అంటున్నారు. ఏది ఏమైనా ఎలక్ట్రోల్ కాలేజి లో బీజేపీకి బలం ఉంది కాబట్టి జగదీప్ ధనకర్ కొత్త ఉప రాష్ట్రపతి అవడం ఖాయం అనే అంటున్నారు.
Tags:    

Similar News