దుబ్బాక విజయంతో బీజేపీ జోష్ మీదుంది. ఇదే ఊపులో హైదరాబాద్ జీహెచ్ఎంసీని ఊడ్చేయాలని పట్టుదలతో ఉంది. అందుకే కేంద్రంలోని బీజేపీ అధిష్టానం ఈ మేరకు రంగం సిద్ధం చేస్తోంది. త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఉబలాటపడుతోంది. ఈ క్రమంలోనే జీహెచ్ఎంసీ ఎన్నికల ఇన్చార్జిలను పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు.
బీజేపీ జాతీయ కార్యదర్శి భూపేందర్ యాదవ్ ను జీహెచ్ఎంసీ ఎన్నికల ఇన్ చార్జిగా నియమించారు. ఇక ఈయనతోపాటు కర్ణాటక మంత్రి సుధాకర్, మహారాష్ట్ర బీజేపీ విప్ ఆశిష్, గుజరాత్ బీజేపీ కార్యదర్శి ప్రదీప్ సింగ్, బీజేపీ ఎమ్మెల్యే సతీష్ రెడ్డిలను సహ ఇన్ చార్జిలుగా నియమించారు.
దుబ్బాక వేవ్ ను తెలంగాణలో కొనసాగించాలని.. ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టువిడవకూడదని బీజేపీ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాలనుంచి జాతీయ కార్యవర్గం నుంచి బాగా పనిచేసే వారిని ఏర్చికూర్చి ఈ నియామకం చేసినట్టు తెలుస్తోంది.
ఇక వీరితోపాటు తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సైతం జీహెచ్ఎంసీ ఎన్నికల బాధ్యతలు తీసుకున్నట్టు సమాచారం.
మొత్తంగా దిగ్గజాలను మోహరించి హైదరాబాద్ గొల్కొండ ఖిల్లాపై కాషాయ జెండా ఎగురవేసేందుకు బీజేపీ వడివడిగా వస్తున్నట్టు తెలుస్తోంది. మరి గులాబీ దండు ఎలా కాచుకుంటుందనేది వేచిచూడాలి.