దేశంపై బీజేపీ మరో సర్జికల్ స్ట్రైక్

Update: 2019-12-16 07:43 GMT
పౌరసత్వ సవరణ బిల్లుతో ఇప్పటికే దేశంలో అగ్గిరాజేసిన కేంద్రంలోని బీజేపీ సర్కారు ఇప్పుడు మరో బాంబు వేయడానికి సిద్ధమైందన్న ప్రచారం ఢిల్లీలో సాగుతోంది. దేశంపై మరో సర్జికల్ స్ట్రైక్ లాంటి ఈ బిల్లు చట్టరూపం దాల్చితే మరింత అల్లకల్లోలం ఖాయమని రాజకీయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ఆర్సీ). సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు అక్రమ వలసదారులను దేశం నుంచి ఏరివేసి వారిని స్వదేశాలకు పంపేందుకు ఈ ఎన్ఆర్సీ బిల్లును తేబోతున్నారు. పౌరసత్వ సవరణ చట్టం ప్రకారం బంగ్లాదేశ్, పాకిస్తాన్, అప్ఘనిస్తాన్ నుంచి ఇండియాకు వచ్చిన హిందువులు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్దులు, జైన్, పార్శీలకు కేంద్రం పౌరసత్వం ఇస్తుంది. అయితే ఆ దేశాల నుంచి వచ్చే ముస్లింలకు మాత్రం దేశంలో చోటు ఉండదు.  ఆ దేశపు అక్రమ వలసదారు ఇక్కడ ఉండేందుకు ఎన్ ఆర్సీ బిల్లు కార్యరూపం దాల్చితే వీలుండదు. ఇతర దేశాల నుంచి వచ్చిన ముస్లింలు చిక్కుల్లో పడతారు.

ఇప్పటికే ఈ ఎన్ఆర్సీ బిల్లును అస్సాంలో అమలు చేశారు.19 లక్షల మంది అక్రమ వలసదారులను గుర్తించి డిటెక్షన్ కేంద్రాలకు తరలించారు. వారిని వారి వారి దేశాలతో సంప్రదించి తిరిగి పంపేందుకు విదేశీ వ్యవహారాల శాఖ రెడీ అయ్యింది.

దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీకి కట్టుబడి ఉన్నామని అమిత్ షా ఇప్పటికే ప్రకటించారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశ పెట్టే ఆలోచనలో బీజేపీ ఉందట.. సో ఇదే జరిగితే బీజేపీ దేశంపై మరో సర్జికల్ స్ట్రైక్ చేసినట్టే. ఇప్పటికే ఈ బిల్లును నోట్ల రద్దు కంటే పెద్ద ఉపద్రవమని ప్రముఖ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ విమర్శించాడు.పేద, మధ్యతరగతికి తీవ్ర నష్టం అని పీకే ట్వీట్ చేశారు.
Tags:    

Similar News