దీదీ బ్యాచ్ కి ద‌డ పుట్టించేలా మాజీ ఐపీఎస్ మాట‌లు

Update: 2019-05-05 11:23 GMT
ప‌శ్చిమ‌బెంగాల్ గురించి విన్నంత‌నే అక్క‌డ చ‌దువుకున్న వారు ఎక్కువ‌ని.. వారి ఆలోచ‌న‌లు ఎంతో ఉన్న‌తంగా ఉంటాయ‌ని.. వారు స్వేచ్ఛ‌కు ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తార‌న్న మాట‌ల్ని కొంద‌రు చెబుతుంటారు. కానీ.. అక్క‌డి రాజ‌కీయం చూసిన‌ప్పుడు ఆ మాట‌ల‌న్ని ఎంత అబ‌ద్ధాల్లో ఇట్టే అర్థ‌మ‌వుతుంది. స్వాతంత్య్ర పోరాట స‌మ‌యంలో మూర్తీభ‌వించిన చైత‌న్యంతో స్ఫూర్తి ర‌గిలించిన బెంగాలీలు తాజా రాజ‌కీయం మ‌రీ ఇంత ద‌రిద్రంగా ఉందా? అన్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం.

క‌మ్యూనిస్టులు వ‌ర్సెస్ తృణ‌మూల్ కాంగ్రెస్ మ‌ధ్య న‌డిచిన హైఓల్టేజ్ రాజ‌కీయాలు ఒక ఎత్తు అయితే.. మోడీ క‌న్ను బెంగాల్ మీద ప‌డ‌టం.. అక్క‌డ పాగా వేస్తే త‌మ అధికారాన్ని సుస్థిరం చేసుకోవాల‌న్న ప్లాన్ చేయ‌టం తెలిసిందే. అయితే.. బెంగాల్ లో పాగా వేయ‌టం అంత ఈజీ కాదు. అందుకు చాలానే ప్ర‌య‌త్నాలు చేయాలి.

అర్థ‌బ‌లంతో పాటు అంగ‌బ‌లం.. అన్నింటికి మించి హింసా రాజ‌కీయాల్ని వెనుకా ముందు లేకుండా చేసే స‌త్తా సొంతం. ఇక‌.. హుందా రాజ‌కీయాల‌న్న‌వి ఆ రాష్ట్రంలో అస్స‌లు వ‌ర్క్ వుట్ కావ‌ని చెబుతారు. దీదీ పాల‌న చూస్తే ఇవ‌న్నీ చ‌క్క‌గా క‌నిపిస్తాయి.

దీదీ జోరుకు బ్రేకులు వేస్తూ.. ఆమె కోట‌లో పాగా వేయాల‌ని భావిస్తున్న మోడీ.. తాజాగా జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో త‌న శ‌క్తి మేర చాలానే ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. ఇందులో భాగంగా ఈ మ‌ధ్య‌న కోల్ క‌తా ద‌గ్గ‌ర‌లో జ‌రిగిన ఎన్నికల స‌భ‌లో మాట్లాడుతూ.. త‌న‌కు 40 మంది తృణ‌మూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ట‌చ్ లో ఉన్నార‌ని.. ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డిన రోజు ఏం జ‌రుగుతుందో చూడాల‌ని వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్య‌ల‌పై పెను దుమార‌మే రేగింది. ఇదిలా ఉంటే.. త‌న‌ను అదే ప‌నిగా  ఇరిటేట్ చేస్తున్న బీజేపీ కార్య‌క‌ర్త‌ల్ని ఉద్దేశించి మ‌మ‌తా చేసిన ఘాటు వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి. ఎన్నిక‌ల త‌ర్వాత ప‌శ్చిమ‌బెంగాల్ లోనే ఉండాల‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోవ‌ద్ద‌ని చేయ‌టం చూస్తే.. అక్క‌డి రాజ‌కీయం ఎలా ఉంటుందో ఇట్టే అర్థ‌మవుతుంది. దీదీ మాట‌ల్నే ఫాలో అవుతున్న బీజేపీ నేత‌లు.. తామేం త‌క్కువ తిన‌లేద‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

దీనికి తాజా ఉదంతం ఒక ఉదాహ‌ర‌ణ‌గా చెప్పాలి. త‌మ కార్య‌క‌ర్త‌ల‌పై వేధింపులు ఎక్కువ అవుతున్నాయ‌ని ఘ‌ట‌ల్ ఎంపీ స్థానం బ‌రిలో ఉన్న బీజేపీ అభ్య‌ర్థి మాజీ ఐపీఎస్ అధికారిణి భార‌తీ ఘోష్ ఆరోపించారు. ఆనంద‌పూర్ ప్రాంతంలో తృణ‌మూల్ కార్య‌క‌ర్త‌ల దాడిలో గాయ‌ప‌డిన‌ట్లు చెబుతున్న కొంద‌రిని ప‌రామ‌ర్శించిన అనంత‌రం భార‌తి ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

ఓట్లు వేయొద్ద‌ని ప్ర‌జ‌ల్ని బెదిరిస్తారా?  బెదిరించ‌నివ్వండి.. నేను కూడా వాళ్ల‌ని ఇళ్ల‌లో నుంచి బ‌య‌ట‌కు లాక్కొచ్చి.. కుక్క‌ల్ని కొట్టిన‌ట్లు కొడ‌తా. వాళ్లు ఏది ఇస్తే.. వ‌డ్డీతో స‌హా చెల్లిస్తాన‌న్న వ్యాఖ్య‌లు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారాయి. అంతేకాదు.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ నుంచి వేలాది మందిని తీసుకొచ్చి టీఎంసీ కార్య‌క‌ర్త‌ల్ని కొట్టిస్తానంటూ ఆమె వేసిన చిందులు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి.

అలాంటి ప‌రిస్థితి చోటు చేసుకున్న‌ప్పుడు తృణ‌మూల్ కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు ఇళ్ల‌ల్లోకి వెళ్లి తాళాలు వేసుకోవాల్సి వ‌స్తుంద‌న్న హెచ్చ‌రిక‌లు హాట్ టాపిక్ గా మారాయి. ఈ త‌ర‌హా వ్యాఖ్య‌లు బెంగాల్ లో మాత్ర‌మే వినిపిస్తాయి. మ‌రింత దారుణ వ్యాఖ్య‌ల వేళ‌లోనూ.. ఈసీ ఏం చేస్తున్న‌ట్లు..?


Tags:    

Similar News