తెలంగాణలో జరిగిన దుబ్బాక ఎన్నికల్లో అన్ని మీడియా సంస్థలు.. సర్వే ఏజెన్సీలు అధికార టీఆర్ఎస్ దే విజయం అన్నాయి. గన్ షాట్ గా గెలుస్తుందని చెప్పాయి. కానీ ఒకే ఒక్క పబ్లిక్ పల్స్ సర్వే మాత్రం అక్కడ బీజేపీ గెలుస్తుందని చెప్పింది. మా ‘తుపాకీ.కామ్’ సైతం దుబ్బాకలో జయం కమల దళానిదేనని ఇదివరకే విశ్లేషించింది. ఇప్పుడు అదే దుబ్బాకలో ఆవిష్కృతమైంది.
దుబ్బాకలో అందరి అంచనాలు తలకిందులయ్యాయి. బీజేపీ ఓడిపోతుందని అందరూ అన్నా అక్కడి ప్రజల పల్స్ ను ‘పబ్లిక్ పల్స్’ సరిగ్గా అంచనా వేసింది. ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుందని రిపోర్టు ఇచ్చింది. మిగతా అన్ని సర్వేలు టీఆర్ఎస్ దే విజయం అన్నాయి.. కానీ ఇప్పుడు ప్రజల అంచనాను సరిగ్గా అంచనావేయడంలో పబ్లిక్ పల్స్ సంస్థ సఫలమైందనే చెప్పొచ్చు.
దుబ్బాక ఎన్నికల్లో 82శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ గత మంగళవారం సాయంత్రం 6 గంటలకు ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా వెలువడ్డాయి. కొన్ని అధికార టీఆర్ఎస్ గెలుస్తుందని ఫలితాలు ప్రకటించాయి. ఈ క్రమంలోనే దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల్లో ‘పబ్లిక్ పల్స్ సర్వే ఏజెన్సీ’ తమ ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాలను వెల్లడించింది. ఇది వరకు చాలా ఎన్నికల ఫలితాలను ఖచ్చితత్వంతో వెల్లడించిన పబ్లిక్ పల్స్ సంస్థ దుబ్బాకలోనూ ఓట్లేసిన ప్రజల అభిప్రాయాలను క్రోడీకరించి సర్వే ఫలితాలను వెల్లడించింది.
దుబ్బాక లో బీజేపీ గెలుస్తుందని ‘పబ్లిక్ పల్స్ సర్వే ఏజెన్సీ’ స్పష్టం చేసింది. బీజేపీకి దుబ్బాకలో 45.2శాతం ఓట్లు వస్తాయని తెలిపింది. ఇక అధికార టీఆర్ఎస్ కు 42.5శాతం ఓట్లు మాత్రమే వస్తాయని వివరించింది. ముచ్చటగా మూడో స్తానంలో కాంగ్రెస్ పార్టీ 11.7శాతం ఓట్లు సాధించి వెనుకబడుతుందని తెలిపింది. ఇక ఇతరులకు 0.6శాతం ఓట్లు వస్తాయని వివరించింది. టీఆర్ఎస్ పై బీజేపీ 4000-6000 ఓట్ల మెజార్టీతో గెలిచే అవకాశం ఉందని పబ్లిక్ పల్స్ ప్రజల నాడిని పసిగట్టి చెప్పుకొచ్చింది. మండలాల వారీగా పబ్లిక్ పల్స్ మెజార్టీ ఓట్లు ఎవరికి వస్తాయన్నది ఖచ్చితత్వంతో సర్వే చేసింది. దుబ్బాక, చేగుంట, నర్సంగి, మిడిదొడ్డి మండలాల్లో బీజేపీ మెజారిటీ సాధిస్తుందని తెలిపింది. ఇక ఒకే ఒక తొగుట మండలంలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సాధిస్తుందని తెలిపింది.రాయపోలు, దౌల్తాబాద్ మండలాల్లో టీఆర్ఎస్ పార్టీకి అత్యధిక ఓట్లు వస్తాయని వివరించింది.
తాజాగా వెలువడిన ఫలితాల్లో ‘పబ్లిక్ పల్స్ సర్వే ఏజెన్సీ’ చెప్పినట్టే బీజేపీ విజయం సాధించింది. అయితే 4వేల నుంచి 6వేల మెజార్టీ కాకుండా కాస్త తక్కువగా.. 1,118 ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించారు. ఒక్క ఓటుతో గెలిచినా అది విజయం.. స్వల్ప ఆధిక్యమే అయినా ప్రజల నాడిని పబ్లిక్ పల్స్ పసిగట్టింది. తుపాకీ. కామ్ సైతం దుబ్బాకలో బీజేపీదే విజయం అని రాసుకొచ్చింది. అదే ఇక్కడ పునరావృతమైంది.
నిక్కచ్చిగా నిజాలు చెప్పడానికి ఎంతో ధైర్యం కావాలి. అలాగే ప్రజల నాడిని పసిగట్టడానికి కూడా అంతే విశ్వసనీయత కావాలి. టీఆర్ఎస్ గెలుస్తుందన్న సర్వేలు ఇప్పుడు విఫలం కాగా.. బీజేపీ గెలుస్తుందన్న సరిగ్గా అంచనావేసి తుపాకీ-పబ్లిక్ పల్స్ ప్రజల అభిమానాన్ని మరోసారి నిలబెట్టుకున్నాయి. మీ విశ్వసనీయతను కడదాకా కొనసాగిస్తామని ఆశిస్తూ...