తెలంగాణలో తదుపరి తామే అంటూ భారతీయ జనతా పార్టీ వాళ్లు ఇప్పటికే చాలా సార్లు ప్రకటించుకున్నారు. లోక్ సభ ఎన్నికల్లో కొన్ని ఎంపీ సీట్లలో అనూహ్య విజయం సాధించే సరికి భారతీయ జనతా పార్టీ ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. గత ఆరు నెలల్లో బీజేపీ వాళ్లు చాలా హడావుడి చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితికి ప్రత్యామ్నాయం తామేనంటూ ప్రకటనలు చేసుకున్నారు. అయితే హుజూర్ నగర్ ఉప ఎన్నికలో బీజేపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది.
అయినా కొంచెం గ్యాప్ తీసుకుని మళ్లీ బీజేపీ వాళ్లు తామే ప్రత్యామ్నాయం అంటూ మాట్లాడుతూ ఉన్నారు. అయితే మాటలతో చేసేది ప్రజాస్వామ్యంలో ఏమీ ఉండదు. ఏదైనా సీట్లతో చూపించాల్సిందే. ఇలాంటి నేపథ్యంలో.. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఏ మేరకు సత్తా చాటుతుంది? అనేది ఆ పార్టీ భవిష్యత్ అవకాశాలను నిర్దేశించబోతూ ఉందనేది నిష్టూరమైన నిజం.
మున్సిపోల్స్ లో బీజేపీ సత్తా చూపిస్తే.. అప్పుడు అది తెలంగాణ రాష్ట్ర సమితికి ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశం ఉంటుంది. అలా సత్తా చూపించలేకపోతే కమలం పార్టీ నేతలవి ఒట్టి ప్రగల్బాలు మాత్రమే అవుతాయి. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు ఆసక్తిదాయకమైన ప్రకటనలు చేశారు.
బీజేపీ సత్తా ఏమిటో మున్పిపోల్స్ లో చూపించాలన్నారు. అసలు మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి అభ్యర్థులే దొరకడం లేదని, టీఆర్ఎస్ రెబల్స్ కోసం బీజేపీ వెదుకుతూ ఉందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. తమ పార్టీ తరఫున టికెట్ ఆశించి , అది దొరకక పోతే నిరాశ పడేవారిని చేర్చుకుని టికెట్ ఇవ్వాలని బీజేపీ ప్రయత్నాలు సాగిస్తోందని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఇలా బీజేపీ గాలి తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు గులాబీ పార్టీ నేతలు. మాటలు కాదు కానీ, ఎన్నికల ఫలితాలు ఏ పార్టీ సత్తా ఎంతనేది తేలుస్తాయి.