ఉత్తరాఖండ్ రాజకీయాలు నాటకీయంగా తయారవుతున్నాయి. అక్కడి అధికారపక్ష కాంగ్రెస్ కు.. విపక్ష బీజేపీకి మధ్య ఏ మాత్రం పొసగని పరిస్థితి. ఆ మధ్యన బీజేపీ నేతపై ఒక మహిల రేప్ ఆరోపణలు చేయటం సంచలనం సృష్టించింది. ఇదిలా ఉంటే.. రేప్ ఆరోపణలు చేసిన సదరు మహిళా ఈసారి మరింత సంచలనం సృష్టించేలా వ్యాఖ్యలు చేయటం రాజకీయవర్గాల్లో కలకలం రేపుతోంది. బీజేపీ నేత హరక్ సింగ్ రావత్ తనపై లైంగిక దాడికి పాల్పడినట్లుగా తాను చేసిన ఫిర్యాదు మొత్తం ముఖ్యమంత్రి హరీశ్ రావత్ ఒత్తిడి చేయటంతో తాను అలాంటి ఆరోపనలు చేసినట్లుగా సదరు మహిళ చెబుతోంది.
ముఖ్యమంత్రి ఒత్తిడితో తప్పుడు కేసులు పెట్టినట్లుగా చెబుతున్న సదరు మహిళ చేసిన వ్యాఖ్యలపై ఉత్తరాఖండ్ బీజేపీ వర్గాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ఒక మహిళను ఒత్తిడి చేసి.. ఆమెను కష్టాలు పాలు చేసి రాజకీయంగా లబ్థి పొందటం ఏమిటంటూ వారు తీవ్రంగా తప్పు పడుతున్నారు. ఇలాంటి రాజకీయాలు చేసే రావత్ కు ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదంటూ వారు మండిపడుతున్నారు.
హరీశ్ రావత్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని.. ముఖ్యమంత్రి పదవిలో కూర్చునే అర్హత ఆయనకు లేదని బీజేపీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నయి. ఒక మహిళను బెదిరించి రాజకీయంగా లబ్థి పొందాలని భావిస్తున్న వ్యక్తికి సీఎం పదవిలో కూర్చునే అర్హత లేదని ఉత్తరాఖండ్ కమలనాథులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. మరి.. ఈ ఎపిసోడ్ రానున్న రోజుల్లో మరెన్ని మలుపులు తిరుగుతుందో..?