కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టి ఇప్పటికి ఎనిమిదేళ్ళు అయింది. దేశంలో ఇప్పటి దాకా చూస్తే ఎనభై లక్షల కోట్ల అప్పులను తెచ్చింది కానీ అభివృద్ధి మాత్రం ఎక్కడా చేసింది లేదు. ఇక అప్పుల సంగతి అలా ఉంచితే కులాల మతాల మధ్య చిచ్చు పెట్టడం కుంపట్లు రగల్చడం వంటివి చేస్తున్నారు అని అంటున్నారు. దానికి అచ్చమైన ఉదాహరణ తెలంగాణానే అని చెపాల్సి ఉంటుంది.
కొత్తగా ఏర్పడిన చిన్న రాష్ట్రం తెలంగాణాకు ఇప్పటిదాకా నిఖార్సుగా బీజేపీ ఏమి తెచ్చింది అంటే జవాబు ఉండదు. ఇక హైవేస్ ఇచ్చాం, రాష్ట్రం మాత్రం స్థలాలు ఇవ్వడంలేదు అని కుంటిసాకులు బీజేపీ పెద్దలు చెబుతున్నారు.
హైవేస్ ని తీసుకుంటే ఒక్క తెలంగాణా రాష్ట్రానికి మాత్రమే ఇవ్వలేదు. దేశంలో చాలా చోట్ల ఇచ్చారు. ఉదాహరణగా చూస్తే కాశ్మీర్ టూ కన్యాకుమారికి ఒక హైవేను ఇచ్చారు. ఇక దీన్ని కూడా గొప్పగా చెప్పుకుంటూ ఎన్నో రాష్త్రాల మీదుగా పోయే హైవే అని అంటున్నారు.
ఇక ఏపీలో చూసుకుంటే అప్పులు ఎంత చేసుకున్నా అనుమతి ఇస్తున్నారు. అదే సమయంలో అభివృద్ధికి నిధులు ఇవ్వమంటే మాత్రం పైసా విదల్చడంలేదు అన్న విమర్శలు ఉన్నాయి.మరో వైపు కేంద్రం వాటా ఉన్న ప్రాజెక్టులతో పాటు పరిశ్రమలను అమ్మేసేందుకు సిద్ధపడిపోతున్నారు. అంటే ఒక వైపు ఏమీ ఇవ్వకుండా మరో వైపు ఉన్న వాటికి మంగళం పాడేయడం అన్న మాట.
ఇక దేశంలో 80 లక్షల కోట్ల అప్పులను తెచ్చింది ఎనిమిదేళ్ల మోడీ సర్కార్. మరి ఆ అప్పులతో ఏం చేశారు, అంత సొమ్ము ఏమైంది అంటే అది గుజరాత్ లోని బడా వ్యాపారులకు పారిశ్రామికవేత్తలకు ఇండైరెక్ట్ గా ఇచ్చారు అని అంటున్నారు. ఈ మొత్తం ఎనభై లక్షల కోట్ల అప్పులలో దేశంలో సామాన్యుడికి దక్కింది చేరింది చివరకు ఎంత అంటే కేవలం ఒక్క శాతం మాత్రమే అని అంటున్నారు. మిగిలినది అంతా అంబానీలకు, ఆదానీలకే దోచిపెట్టారని విమర్శలు ఉన్నాయి.
అందుకే కరువు కాలమైనా కరోనా కాలం అయినా కూడా అంబానీ ఆదానీ ప్రపంచంలోనే అత్యంత ధనవంతులుగానే ఇంకా తమ ర్యాంకులను పెంచుకుంటూ పోతున్నారు. మరి మోడీ ఎనిమిదేళ్ళ పాలన చూస్తే దేశంలో అత్యధిక వర్గాలు పెదవి విరుస్తున్నాయి అంటే వింతేముంది అలాగే వివిధ రాష్ట్రాలలో ఆయా ప్రభుత్వాలు రాజకీయ పార్టీల నేతలు కూడా మోడీ సర్కార్ ని టార్గెట్ చేస్తున్నారు అంటే చేయరా అన్న చర్చ కూడా ఉందిపుడు.