20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించినా స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. దేశ ఆర్థిక వ్యవస్థ గాడినపడలేదు. మోడీ ప్యాకేజీ గాలి బుడగ అని మేధావులు, మీడియా ఆడిపోసుకుంది. ఉట్టి ఉత్తుత్తి ప్యాకేజీ అన్న విమర్శలు వచ్చాయి. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయడానికి మోడీ కఠిన నిర్ణయం తీసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ముఖ్యంగా దురుసుగా.. దూకుడుగా ముందుకెళ్తున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు మోడీ గుడ్ బై చెప్పి కొత్త ఆర్థిక మంత్రిని తీసుకురాబోతున్నట్టు ఢిల్లీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఈ మేరకు కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చేపట్టబోతున్నట్టు తెలుస్తోంది. నిర్మల స్థానంలో కొత్త ఆర్థిక మంత్రిగా సీనియర్ బ్యాంకర్ , ప్రముఖ ఆర్థిక నిపుణులు కేవీ కామత్ ను తీసుకురాబోతున్నట్టు సంకేతాలు వినిపిస్తున్నాయి.
బ్రిక్స్ దేశాల న్యూ డెవలప్ మెంట్ బ్యాంక్ (ఎన్డీబీ) చీఫ్ గా ఇటీవలే ఐదేళ్లు పూర్తి చేసుకున్న కామత్ వచ్చే నెలలో రిటైర్ కాబోతున్నారు. ఆయనకే కేంద్ర ఆర్థిక మంత్రి పదవి ఇస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ధీరుబాయ్ అంబానీ మరణం తర్వాత ముఖేష్, అనిల్ అంబానీల ఆస్తుల పంపకాన్ని చేపట్టింది ఇదే కామత్ కావడం విశేషం. కరోనా-లాక్ డౌన్ తో కుదేలైన భారత ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు నింపేందుకు కామత్ ను కేంద్ర ఆర్తిక మంత్రిగా తీసుకురాబోతున్నట్టు తెలుస్తోంది.
నిర్మల దేశంలో తొలి మహిళా ఆర్థిక మంత్రి. పైగా సీనియర్ నాయకురాలు. కానీ ఆమె హయాంలో ఆర్థిక రంగాన్ని బలోపేతం చేయడంలో కేంద్రం ఘోరంగా విఫలమైందన్న వాదన వినిపిస్తోంది. అందుకే ఆర్థికమంత్రిగా అనుభవజ్ఞుల్ని పెట్టాలని కేంద్రం చూస్తున్నట్టు సమాచారం.