బీజేపీలో మరో సీనియర్ నేత కెరీర్ కు శుభం కార్డు!

Update: 2019-04-22 05:01 GMT
ఇప్పటికే ఈ ఎన్నికల పోటీ నుంచి అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటి వాళ్లను తప్పించిన మోడీ - అమిత్ షా ద్వయం.. ఈ సారే మరో నేతను కూడా పక్కన పెట్టేందుకు ముందు నుంచినే ప్రణాళికలు సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ను కూడా పక్కన పెట్టడానికి చాన్నాళ్లుగానే రంగం సిద్ధం అయ్యింది. ఆమె వయసు కూడా డెబ్బై ఐదు దాటడంతో ఆమె కూడా చట్టబద్ధమైన పదవులకు పనికిరాదన్నట్టుగా మోడీ - షాల నియమం అమలు అయ్యింది.

డెబ్బై ఐదేళ్ల వయసు దాటిని చాలా మంది నేతలను ఇప్పటికే ఇంటికి పంపించారు మోడీ- షా. ఆ నియమంతో పలువురిని కేబినెట్ నుంచి తప్పించారు. ఎన్నికల వేళ ఆ నియమాన్ని గట్టిగా అమల్లో పెట్టి.. మరింత మంది సీనియర్లను అప్రాధాన్యతలోకి నెట్టేశారు.

ఈ నియమం పేరు చెప్పే ఎంపీ అభ్యర్థుల జాబితాలో సుమిత్రా మహాజన్ పేరు లేకుండా చేశారు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నుంచి ఆమె సిట్టింగ్ ఎంపీగా ఉన్న సంగతి తెలిసిందే. తొలి జాబితాల్లో ఆమె పేరు లేదు. దీంతో ఆమెకు టికెట్ దక్కదని క్లారిటీ వచ్చేసింది. దీంతో ఆమె స్పందించారు. తనే పోటీ నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటన చేశారు.

మొదటేమో తను ఎప్పుడూ టికెట్ అడగలేదన్న సుమిత్ర ఆ తర్వాత మాత్రం తనే తప్పుకుంటున్నట్టుగా ప్రకటించారు! ఇక తాజాగా ఇండోర్ కు శంకర్ లాల్వానీ అనే అభ్యర్థిని ప్రకటించింది భారతీయ జనతా పార్టీ. అతడు  సుమిత్రా మహాజన్ కు విధేయుడే అని తెలుస్తోంది.  ఏదేమైనా బీజేపీలో మరో సీనియర్ నేత కెరీర్ కు శుభం కార్డు పడిందని మాత్రం స్పష్టం అవుతోంది.
Tags:    

Similar News