కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జోరు... నరేంద్రమోడీ-అమిత్ షా ద్వయం ఊపు చూస్తుంటే ముందస్తు ఎన్నికలు రావడం గ్యారంటీ అన్న అభిప్రాయం వినిపిస్తోంది. అదే జరిగితే బీజేపీ మిత్రపక్షం టీడీపీ అధికారంలో ఉన్న ఏపీలోనూ లోక్ సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించేలా చంద్రబాబుపై బీజేపీ ఒత్తిడి చేయడం గ్యారంటీ. అయితే... మోడీ ముందస్తు ఎన్నికలపై ఇంట్రస్టు చూపుతున్నట్లుగా చంద్రబాబు చూపించడం లేదట. అవకాశం ఉన్నంత కాలం పదవిలో ఉందాం... ఆ తరువాత ఎన్నికల్లో గెలుస్తామో లేమో చెప్పలేం కాబట్టి ఒక్క రోజు పదవీ కాలాన్ని కూడా వదులుకోరాదని అనుకుంటున్నారట. ఈ నేపథ్యంలో బీజేపీ ఒత్తిడి చేస్తే ఏం చేయాలా అని తెగ టెన్షన్ పడుతున్నారట.
మరోవైపు చంద్రబాబుకు ముందస్తు ఎన్నికలు అచ్చిరావన్న వాదన కూడా ఉంది. గతంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లి చంద్రబాబు దెబ్బతిన్నారని టీడీపీ నేతలు అంటున్నారు. ఆ సెంటిమెంటు కూడా చంద్రబాబును, టీడీపీ నేతలను తెగ టెన్షన్ పెడుతోందట. ఈ నేపథ్యంలో బీజేపీ ముందస్తు దూకుడు చూసి టీడీపీలో ఆందోళన మొదలైంది.
చంద్రబాబు స్వయంగా చేయించుకుంటున్న సర్వేల ఆధారంగా ఆయనకు కూడా ఓ విషయం స్పష్టంగా అర్థమైంది. అధికారంలోకి వచ్చి మూడేళ్లే అయినా ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉందని గుర్తించారు. అయితే... ఇంకా మిగిలిన ఉన్న రెండేళ్లలో దీన్ని పోగొట్టడం కష్టమనుకుంటున్న తరుణంలో ఏకంగా ఎన్నికలను ముందుకు జరిపితే మరింత నష్టపోతామన్నది చంద్రబాబు భయం. వీలైనంత ఎక్కువ టైముంటే వీలైనంత మేరకు పరిస్థితులను దారికి తెచ్చి మళ్లీ అధికారంలోకి రావాలన్నది ఆయన ప్లానుగా తెలుస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/