అవును జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు బీజేపీ నేతలు షాకులిస్తునే ఉన్నారు. ఈసారి పవన్ కు షాకిచ్చింది తెలంగాణా బీజేపీ. అసలు రెండుపార్టీల మధ్య పొత్తుందో లేదో కూడా స్పష్టంగా ఎవరికీ తెలీదు. ఎందుకంటే జనసేనతో బీజేపీకి పొత్తేలేదు పొమ్మని గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందర్భంగా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ స్వయంగా ప్రకటించారు. బీజేపీతో పొత్తులో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 12 డివిజన్లలో జనసేన పోటీ చేయబోతున్నట్లు జనసేన ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది.
సీన్ కట్ చేస్తే 21వ తేదీ ప్రెస్ రిలీజ్ లో 6 డివిజన్లలో జనసేన అభ్యర్ధులు నామినేషన్లు వేసినట్లు ప్రకటించింది. నామినేషన్లు వేసిన ఆరుమంది అభ్యర్ధుల పేర్లు, డివిజన్లను కూడా ప్రెస్ రిలీజ్ లో జనసేన చెప్పింది. బీజేపీతో పొత్తుల్లో భాగంగా ఆరుమంది అభ్యర్ధులు పోటీ చేస్తున్నట్లు, మిగిలిన డివిజన్లలో బీజేపీనే పోటీచేస్తుందని ప్రెస్ నోట్లో స్పష్టంగా ఉంది. మరి ఇదే నిజమైతే 18వ తేదీన 12 డివిజన్లలో పోటీ చేస్తున్నట్లు ఎందుకు ప్రకటించింది ?
నాలుగు రోజుల వ్యవధిలో పోటీచేసే డివిజన్ల సంఖ్య సగానికి సగం ఎందుకు తగ్గిపోయింది ? అన్నదే ఎవరికీ అర్ధం కావటంలేదు. అభ్యర్ధులు లేక జనసేనే డివిజన్లను తగ్గించుకుందా ? లేకపోతే జనసేనకు అంతసీన్ లేదని బీజేపీయే డివిజన్లను తగ్గించేసిందా అన్నదే అర్ధం కావటంలేదు. ఏదేమైనా జనసేనకు బీజేపీ గట్టి షాకిచ్చిందనే చెప్పాలి. విచిత్రమేమిటంటే ఇప్పటివరకు జనసేనతో తమకు పొత్తు ఉందన్న విషయం బీజేపీ అధ్యక్షుడు బండి ఎక్కడా ప్రకటించినట్లులేదు.
గతంలో పొత్తులేదని ప్రకటించిందే అధికారికం. ఆ తర్వాత బండి ఇప్పటివరకు పొత్తుల గురించి మాట్లాడలేదు. రెండుపార్టీల మధ్య పొత్తున్నదంటే రెండుపార్టీల నేతలు ఆ విషయాన్ని ప్రకటించాలి. కానీ ఇక్కడ పొత్తుంది అనే విషయాన్ని జనసేన మాత్రమే ప్రకటిస్తోంది. పొత్తు విషయాన్ని అసలు బీజేపీ నేతలు అసలు ప్రస్తావించటం లేదు. కాబట్టి మరోసారి పవన్ కు బీజేపీ పెద్ద షాకిచ్చిందనే అనుకోవాలి.