స్టాలిన్ కు షాకిచ్చిన బీజేపీ.. ఊహించని సీన్ జరిగింది

Update: 2021-03-15 02:44 GMT
రోటీన్ కు భిన్నమైన సీన్ ఒకటి తమిళనాడులో చోటు చేసుకుంది. సాధారణంగా ఏదైనా రాజకీయ పార్టీ తప్పనిసరిగా అధికారంలోకి వస్తుందన్న అంచనా వస్తే.. ఆ పార్టీని వీడేందుకు అస్సలు ఇష్టపడరు. ఒకవేళ.. బంఫర్ ఆఫర్ వచ్చినా..ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే వరకు వెయిట్ చేస్తామని చెప్పి తప్పించుకుంటారు. అందుకు భిన్నంగా అధికారంలోకి వచ్చే పార్టీని వదిలేసి.. పార్టీ గెలుపుపై సందేహాలు ఉన్న పార్టీలోకి రావటం జరగదు. కానీ.. అలాంటి రోటీన్ సీన్ ను కాస్త భిన్నంగా చూపించింది బీజేపీ.

దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నిక్లలో తమిళనాడులో విపక్ష డీఎంకే ఈసారి అధికారంలోకి వస్తుందన్న విషయాన్ని పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. అలాంటివేళ..ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు బీజేపీలో చేరి షాకిచ్చారు. ఈసారి ఎన్నికల్లో తమిళనాడులో బోణీ కొట్టటంతో పాటు.. తన ఉనికిని చాటాలన్న పట్టుదలతో బీజేపీ ఉంది. గడిచిన కొద్ది రోజుల్లో విపక్షానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల్నిపార్టీలోకి చేర్చుకోవటం ద్వారా.. సరికొత్త సవాలు విసిరింది. డీఎంకేకు షాకు మీద షాకిస్తోంది.

తాజాగా డీఎంకే ఎమ్మెల్యే శరవణన్ బీజేపీ కండువా కప్పుకున్నారు. ఈ మధ్యనే మరో డీఎంకే ఎమ్మెల్యే కుకా సెల్వమ్ కూడా కమలం పార్టీలో చేరారు. కీలకమైన ఎన్నికలకు రంగం సిద్ధమై.. నామినేషన్ల జోరు సాగుతున్న వేళ.. ఆ పార్టీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు విడిచి వెళ్లటం డీఎంకేకు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. అయితే.. ఒత్తిడికి గురి చేయటంతోపాటు.. ఆవేశంలో తప్పులు జరగాలన్న ఉద్దేశంతోనే ఇలా మైండ్ గేమ్ ఆడుతున్నట్లుగా విశ్లేషిస్తున్నారు. మరి.. బీజేపీ ఎత్తులకు డీఎంకే అధినేత స్టాలిన్ ఎలా రియాక్టు అవుతారో చూడాలి.
Tags:    

Similar News