సార్వత్రిక ఎన్నికలకు కేవలం ఆరు నెలల ముందటి సంగతి ఇదీ.. మధ్యప్రదేశ్ - రాజస్తాన్ - చత్తీస్ ఘడ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. బీజేపీ ఓడిపోయింది. ఇక వీటితోపాటు జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒక్కటంటే ఒక్క సీటుకే పరిమితమైంది. కట్ చేస్తే..
ఆరు నెలల తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో రాజస్థాన్ లో ఓడిన బీజేపీ అక్కడ మొత్తం సీట్లను గెలుచుకొని క్లీన్ స్వీప్ చేసింది. చత్తీస్ ఘడ్ - మధ్యప్రదేశ్ లోనూ మెజార్టీ సీట్లు సాధించింది. సోదీలో లేని తెలంగాణలో అనూహ్యంగా నాలుగు ఎంపీ సీట్లు.. ఏంటీ వైపరీత్యం అని టీఆర్ ఎస్ - కాంగ్రెస్ నేతలు కూడా హతశులయ్యారు. దీనివెనుక ఏదో మతలబు ఉందని కాంగ్రెస్ నేతలు ఇప్పటికీ అనుమానపడుతున్నారు.. తెలంగాణలో జరిగిన ఎన్నికలనే దీనికి ఉదాహరణగా చూపుతున్నారు.
తెలంగాణలో జరిగిన ఎంపీ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 4 సీట్లు గెలుచుకుంది. తెలంగాణ వ్యాప్తంగా 20శాతం ఓటు బ్యాంకును సాధించింది. దీని తర్వాత నెలకు స్థానిక సంస్థల ఎంపీటీసీ - జడ్పీటీసీ ఎన్నికలు జరిగాయి. ఇవి బ్యాలెట్ తో జరిగాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ తెలంగాణ వ్యాప్తంగా.. ఈవెన్ బీజేపీ గెలిచిన నాలుగు ఎంపీ సీట్లలో కూడా 5శాతం లోపే ఓట్లు సాధించింది. కొన్ని చోట్ల 2శాతం ఓట్లు మాత్రమే పడ్డాయి. కరీంనగర్ లో బీజేపీ ఎంపీగా బండి సంజయ్ గెలిచారు. కానీ ఒక్క మండలానికి చెందిన జడ్పీటీసీని - ఎంపీపీని బీజేపీ ఈ జిల్లాలో గెలుచుకోకపోవడం గమనార్హం.
ఇప్పుడు కాంగ్రెస్ ఘోర ఓటమితో దాని అధ్యక్షుడే కాడి వదిలేయడం చూశాక.. బీజేపీ కుట్రలు - కుతంత్రాలను వెలికి తీయాలని కాంగ్రెస్ నేతలు రెడీ అయ్యిందట.. బీజేపీ ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి గెలిచిందని కాంగ్రెస్ నేతలు ఆధారాలతో పెద్ద ఎత్తున లేవనెత్తడానికి రెడీ అవుతున్నారంట.. 6 నెలల కిందట గెలిచిన కాంగ్రెస్ ఇప్పుడు ఎలా ఓడిపోయిందని వాళ్లు ప్రశ్నించడానికి రెడీ అయ్యారట.. ఈవీఎం ట్యాంపరింగ్ వల్లే బీజేపీ కేంద్రంలో గెలిచిందని ఉద్యమించేందుకు కాంగ్రెస్ రెడీ అవుతున్నట్టు వార్తలు రావడం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీయబోతోంది.