శివసేన పై బీజేపీ ప్రేమ.. ఏంటా కథ?

Update: 2020-01-31 11:12 GMT
మహారాష్ట్ర రాజకీయం కొత్త మలుపు తిరిగింది. తమను మోసం చేసి ఎన్సీపీ, కాంగ్రెస్ లతో కలిసిన శివసేనపై తాజాగా బీజేపీ ప్రేమ కురిపించడం హాట్ టాపిక్ గా మారింది.

శివసేనతో దోస్తీ కటీఫ్ చేసుకొని మహారాష్ట్ర సీఎం పీఠం వదులుకున్న బీజేపీ తిరిగి పాత స్నేహాన్ని పునరుద్దరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఓపెన్ ఆఫర్ ఇచ్చింది.

ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే కోరితే వారితో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని.. మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత సుధీర్ మునగంటి వార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. శివసేన ఎప్పటికీ తమ మిత్రపక్షమేనని.. ఇద్దరి సిద్ధాంతాలు ఒకటేనని ఆయన అన్నారు.

ఇక కాంగ్రెస్, ఎన్సీపీ హ్యాండ్ ఇచ్చినా శివసేన కోరితే తాము మద్దతు ఇస్తామని బీజేపీ సీనియర్ నేత సుధీర్ స్పష్టం చేశారు. శివసేనకు కాంగ్రెస్ మద్దతు అనేది 21వ శతాబ్ధంలోనే వింత అని.. బీజేపీని ఓడించడానికే ఇలా కుట్ర చేసిందని ఆరోపించారు.

స్నేహితుడిని పోగొట్టుకొని అధికారం కోల్పోయిన బీజేపీ ఇప్పుడు అధికారం కోసమే మళ్లీ శివసేన ఓపెన్ ఆఫర్ ఇచ్చినట్టు అర్థమవుతోంది. కాంగ్రెస్, ఎన్సీపీలు శివసేనకు మద్దతు ఉపసంహరిస్తే మద్దతిచ్చి కలువాలని బీజేపీ చూస్తున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్, ఎన్సీపీల అసమ్మతి నుంచి శివసేనను కాపాడి తమ దారికి తెచ్చుకోవాలని బీజేపీ యోచిస్తోంది.
Tags:    

Similar News