కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు రెంటికి చెడ్డ రేవడిలా తయారయ్యాడన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచి ఆ పార్టీనే విమర్శించారు కోమటిరెడ్డి. తాను బీజేపీలో చేరబోతున్నట్టు.. ఆ పార్టీలోనే భవిష్యత్ ఉంటుందని చెప్పి సంచలన ప్రకటనలు గుప్పించారు. బీజేపీలో తానే సీఎం అభ్యర్థి అంటూ ఆయన చేసిన ప్రకటనే ఇప్పుడు ఆయనను బీజేపీలోకి చేరకుండా అడ్డుకుంటోందన్న చర్చ ఆ పార్టీలో సాగుతోంది.
తాజాగా బీజేపీలో చేరాలని ఆశపడ్డ కోమటిరెడ్డి ప్రయత్నాలకు బీజేపీ అధిష్టానం బ్రేక్ వేసింది. రాష్ట్ర పార్టీ అధ్యక్షులు లక్ష్మన్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిలు కోమటిరెడ్డిని వ్యతిరేకిస్తూ అభ్యంతరం వ్యక్తం చేసినట్టు సమాచారం. వీరిద్దరూ వ్యతిరేకించడంతోనే కోమటిరెడ్డి చేరికను బీజేపీ అధిష్టానం పక్కనపెట్టిందన్న చర్చ సాగుతోంది.
బీజేపీలోకి వెళ్తే తానే సీఎం క్యాండిడేట్ అని కోమటిరెడ్డి బీరాలు పలికాడు. దాంతో అనాదిగా బీజేపీనే పట్టుకొని ఎదిగిన రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిలు గుస్సా అయినట్లు సమాచారం. అందుకే ఆయన దూకుడు పార్టీకి నష్టమని.. ఆయనను చేర్చుకోవద్దని అధిష్టానంతో చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి.
ఈ కోవలోనే రాజగోపాల్ రెడ్డి చేరికకు రంగం సిద్ధం చేసుకున్నా ఆయనను తీసుకోవడానికి ఇప్పుడు బీజేపీ సిద్ధం లేదట.. పార్టీ పగ్గాలను తన చేతికి ఇవ్వాలన్న ఆయన డిమాండ్ మేరకే ఆయనను బీజేపీ దూరం పెట్టిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.