కమలంపార్టీలోని కొందరి పిచ్చి పీక్సుకు చేరుకుంటున్నట్లే ఉంది. దేశంలోనే అన్నీ రాష్ట్రాల్లోను అధికారంలోకి రాలేని పార్టీ పొరుగు దేశాల్లో కూడా అధికారంలోకి వచ్చేస్తామని అనుకుంటున్నదంటే ఏమిటర్ధం ? ఇంతకీ విషయం ఏమిటంటే త్రిపుర సీఎం విప్లవ్ దేవ్ మాట్లాడుతూ బీజేపీ ఆధ్వర్యంలో నేపాల్, శ్రీలంకలో కూడా ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలని పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా 2018లో అనుకున్నట్లు దేవ్ తాజాగా చెప్పారు.
దేశంలోని అన్నీ రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత పొరుగునున్న నేపాల్, శ్రీలంక దేశాల్లో కూడా తమ పార్టీని అధికారంలోకి రావాలని అప్పట్లో అమిత్ తనతో చెప్పినట్లు విప్లవ్ దేవ్ ఇపుడు బయటపెట్టారు. విదేశాల్లో అధికారంలోకి రావాలంటే ముందుగా పై దేశాల్లో పార్టీల యూనిట్లను ఏర్పాటు చేయాల కదా. కమలంపార్టీ నేతలు ఇపుడదే పనిమీద ఉన్నట్లు విప్లవ్ చెప్పటం కాస్త సంచలనంగానే మారింది.
తొందరలోనే ఎన్నికలు జరగనున్న కేరళలో అధికారంలోకి వస్తామని దేవ్ చెప్పారు. అలాగే దక్షిణాది రాష్ట్రాల్లో కూడా బీజేపీ అధికారంలోకి రావటం ఖాయమని విప్లవ్ దేవ్ చెప్పటం చూస్తుంటే విచిత్రంగానే ఉంది.