ఎలాన్ మస్క్ కు కేంద్రం పెద్ద షాక్

Update: 2022-09-14 11:30 GMT
ఇన్నాళ్లు మనకు ఇంటర్నెట్ కేవలం మొబైల్ ఫోన్ టవర్ల ద్వారా మాత్రమే వస్తుంది. అది వైర్ లెస్.. వైరడ్ బ్రాడ్ బాండ్ ఇంటర్నెట్ మాత్రమే దేశంలో ప్రస్తుతం వినియోగిస్తున్నాం. కానీ ఇప్పుడు ఉపగ్రహాల ద్వారా శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను దేశంలో విస్తరించడానికి ప్రపంచంలోనే నంబర్ 1 కుబేరుడు, స్పేస్ ఎక్స్ చైర్మన్ ఎలాన్ మస్క్ ప్రయత్నాలు ప్రారంభించాడు. ఇప్పటికే అమెరికా, యూరప్ లాంటి దేశాల్లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను ఆయన అందిస్తున్నారు.

ఈ క్రమంలోనే భారత్ లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవల కోసం ఎలాన్ మస్క్ తాజాగా కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేశాడు. అయితే పలు కండీషన్లు పెట్టి కేంద్రానికే ఝలక్ ఇచ్చాడు. అభ్యర్థించాల్సింది పోయి కండీషన్లు పెట్టిన ఎలాన్ మస్క్ కు తాజాగా మోడీ సర్కార్ గట్టి షాక్ ఇచ్చింది.  ఎలాన్ మస్క్ ప్రతిపాదించిన శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను దేశంలోకి అనుమతించలేమని కేంద్రం తేల్చిచెప్పింది. ఎలాగూ అనుమతులు వచ్చేస్తాయన్న ఆశతో కొన్ని ప్రాంతాల్లో స్పేస్ ఎక్స్ సంస్థ కొందరినీ ఫ్రీలాంచ్ చందాదారుగా చేసుకుందట.. వీళ్ల దగ్గర నుంచి వేలాది రూపాయలు వసూలు కూడా చేస్తున్నట్టు తెలిసింది.

కేంద్రప్రభుత్వం అనుమతివ్వడమే ఆలస్యం దేశమంతా ఒకేసారి ఇంటర్నెట్ కనెక్షన్లు ఇవ్వడానికి మస్క్ భారీ ప్రణాళికలతో రెడీగా ఉన్నారు. అయితే మన దేశంలో బిజినెస్ చేసుకోవాలనే కోరికతో ఉన్న మస్క్ ఏకంగా కేంద్రానికి కొన్ని షరతులు పెట్టడం గమనార్హం. వ్యాపారం చేసుకోవాలని అనుకునేవారు ఎదుటివారికి షరతులు పెట్టరు. ప్రాథేయపడుతారు. ఇచ్చిపుచ్చుకునే ధోరణి అవలంభిస్తారు. కానీ ఎలాన్ మస్క్ తన దుందుడుకు తనం ప్రదర్శించడంతో కేంద్రం షాక్ ఇచ్చింది.

ఎలాన్ మస్క్ మాత్రం కేంద్రానికి నిబంధనలు పెట్టడంతో మోడీ సర్కార్ సీరియస్ అయ్యి అనుమతులు ఇవ్వలేదు. ఇక అమెరికాకే చెందిన మరో శాటిలైట్ ఇంటర్నెట్ అందించే సంస్థ హ్యూస్ కమ్యూనికేషన్ కేంద్రంతో సఖ్యతతో మాట్లాడి.. దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందించేందుకు అన్ని అనుమతులు తెచ్చుకుంది.

హ్యూస్ సేవలు మొదలైతే నగరాలు, పట్టణాలు, గ్రామాల్లోనూ ఏకకాలంలో ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రావడం ఖాయమట.. శాటిలైట్ ఇంటర్నెట్ సేవలకు కేబుల్స్ అవసరం లేదు. కేబుల్ ద్వారా వచ్చే ఇంటర్నెట్ సేవల కన్నా శాటిలైట్ ద్వారా అందే ఇంటర్నెట్ సేవలు నాణ్యతతో ఉంటాయి. ఎలాంటి అంతరాయాలు లేని సేవలను వినియోగదారులు అందుకుంటారు. ఇండియాలో తన సేవలను అందించేందుకు హ్యూస్ తాజాగా ఇన ‘ఇస్రో’తోనూ ఒప్పందం చేసుకుంది. త్వరలోనే ఇండియా హ్యూస్ ప్రారంభం కానుంది.

అమెరికాలో ఎలాన్ మస్క్ కు పోటీ సంస్థ హ్యూస్. ఆ సంస్థ కేంద్రంలోని మోడీ సర్కార్ తో సన్నిహితంగా మెలిగి ఈ అనుమతులు తెచ్చుకోవడం ఎలాన్ మస్క్ కు మింగుడు పడని విషయంగా మారింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News