నోటు మీద గాంధీ బొమ్మ పోతుందన్న మంత్రి

Update: 2017-01-15 07:59 GMT
గాంధీ ప్లేస్ ని రీప్లేస్ చేసే దిశగా ప్రధాని మోడీ పావులు కదుపుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ.. హర్యానాకు చెందిన బీజేపీ మంత్రి ఒకరు చేసిన కామెంట్లు ఇప్పుడు సంచలనంగా మారాయి. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రధాని మోడీని తీవ్రంగా డ్యామేజ్ చేసేలా ఉండటమే కాదు..బీజేపీకి దెబ్బేసేటట్లు ఉన్నాయని కమలనాథులు ఆందోళన చెందే పరిస్థితి.

మరింత ఇదిగా ఆయనేం మాట్లాడారన్న విషయాన్ని చూస్తే.. ఆయన టచ్ చేసిన సబ్జెక్ట్ అలాంటి ఇలాంటిది కాదనే చెప్పాలి. కరెన్సీ నోట్ల మీద కనిపించే గాంధీ బొమ్మ క్రమంగా పోయే టైం వచ్చేసిందంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఎందుకనగా అన్న విషయాన్ని ఆయన చెబుతూ.. గాంధీ కంటే మోడీనే పెద్ద బ్రాండ్ నేమ్ అంటూ తీవ్ర వ్యాఖ్యలుచేశారు. ఇంతటి దారుణ వ్యాఖ్యలు చేసిన బీజేపీ మంత్రి అనిల్ విజ్.. మరిన్ని మాటలు మాట్లాడారు.

రూపాయి మీద గాంధీ బొమ్మ వచ్చినప్పటి నుంచి దాని విలువ తగ్గిపోవటం మొదలైందని..కాల క్రమంలో నోట్ల మీద నుంచి గాంధీ బొమ్మను తీసేస్తారని వ్యాఖ్యానించారు. అంబాలాలో జరిగిన ఒక బహిరంగ సభలోఅనిల్ విజ్ చేసినవివాదాస్పద వ్యాఖ్యలపై విపక్షాలే కాదు.. సొంత పార్టీ నేతలు సైతం ఖండిస్తున్నారు. ఆయన చెప్పిన మాటలన్నీ మంత్రి సొంత మాటలే తప్పించి.. పార్టీకి ఏ మాత్రం సంబంధం లేదని స్పష్టం చేయటం గమనార్హం.

తాను చేసిన వ్యాఖ్యలపై వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా అందరి తిట్టి పోస్తుండటంతో తాను మాట్లాడిన మాటలు ఎంత తప్పన్న విషయం సదరు మంత్రిగారికి అర్థమైంది. నాలుకర్చుకున్న ఆయన.. తాను చేసిన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకున్నట్లు వెల్లడించారు. కాలు జారినా ఫర్లేదు కానీ.. మాట మాత్రం జార కూడదన్న చిన్న విషయాన్ని మంత్రిగారు మిస్ కావటం ఏంది? గాంధీ మీద అయ్యగారి కామెంట్లు.. ఆయన పదవి కిందకు నీళ్లు తెచ్చేలా ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News