పూర్తి ప్రజా మద్దతు తో వరుసగా రెండో సారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ కి ఈ మధ్య కాలం అంతగా కలిసిరావడంలేదు. ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా బీజేపీ బలమైన పార్టీగా తన ప్రతాపం చూపించలేకపోతుంది. ఎదో గెలిచామంటే గెలిచాం కదా అన్నట్టుగా ముందుకు సాగుతుంది. ఇదే పరిస్థితి కొనసాగితే మరోసారి అధికారంలోకి రావడం కొంచెం కష్టమే. ఇదే విషయాన్ని బీజేపీ నేతలు కూడా అర్థమౌతుంది అందుకే దానికి తగ్గ కారణాలని వెతికే పనిలో పడ్డారు.
ఈ మద్యే జరిగిన మహారాష్ట్ర - హర్యానా ఎన్నికల ఫలితాలని ఒకసారి పరిశీలిస్తే బీజేపీ పరిస్థితి ఏమిటో అర్థమైపోతుంది. హర్యానాలోని కానీ - మహారాష్ట్రలో కానీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. ముఖ్యంగా మహారాష్ట్రలో మెజారిటీ బాగానే వచ్చినప్పటికీ శివసేనతో ఉన్న సంబంధం వల్ల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేక పోతుంది. హర్యానాలో కూడా చివరి నిముషాల్లో ఆఘమేఘాలపై స్పందించి ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కిందుకుంది. కానీ - మహారాష్ట్రలో మాత్రం శివసేన బీజేపీ మాటలకి ససేమిరా అనడంతో ముందు తమ పని కామ్ గా చేసుకొని..ఆ తరువాత శివసేనని మెత్త పరచాహడానికి చూస్తుంది.
ముందుగా సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేస్తే శివసేన కొంత మెత్తబడే అవకాశం ఉందని - బల నిరూపణకు కొంత సమయం ఉంటుందని - ఈలోపు శివసేనతో చర్చలు ఓ కొలిక్కి వస్తాయని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలిసింది. అసలు ఈ వివాదం పెద్దది కావడానికి బీజేపీ కి చెందిన కొంతమంది నేతలే అని అధిష్టానం వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. బీజేపీ నేతలు సీఎం కుర్చీపై మాటల తూటాలు పేల్చుతుండడంతో శివసేన కూడా దానికి దీటుగా బదులిస్తుంది. ఇలా మాటలని పెంచుకుంటూ పొతే మొదటికే మోసం వస్తుంది అని భావించిన బీజేపీ పెద్దలు మహారాష్ట్ర బీజేపీ నేతల నోటికి కళ్లెం వేసేసారు. ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం చేసి అన్ని పరిస్థితులు చక్కబడే వరకు ఎవరూ మాట్లాడటానికి వీలులేదు అంటూ హుకుం జారీచేశారు.
ఫడ్నవీస్ మాటల కారణంగానే ..మంగళవారం జరగాల్సిన చర్చలు కూడా వాయిదా పడటం అందరికి తెలిసిందే. మనం అనుకున్న పని పూర్తి కావాలి అంటే ప్రస్తుతం అందరూ కామ్ గా ఉండాలని .. సీఎం గా ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం చేసినా తరువాత అన్ని సమస్యలకి సమాధానం దొరుకుతుంది అని బీజేపీ అధిష్టానం చెప్తుంది. మొత్తంగా అమిత్ షా రంగంలోకి దిగే వరకూ సంయమనం పాటించాలని మహారాష్ట్ర బీజేపీ నేతలకు ఆదేశాలు పంపినట్లు తెలుస్తుంది. బీజేపీ పరంగా చూస్తే ఇది మంచి నిర్ణయమే కానీ - ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తే ..మద్దతు ఇవ్వండి ..మీ డిమాండ్స్ తరువాత పరిష్కరిస్తాం అంటే నమ్మి వారికీ మద్దతు ఇవ్వడానికి శివసేన ఏమైనా ఓటర్లా . ఎన్నికలలో ఓటర్లు అయితే నేతలు చెప్పే హామీలకి పడిపోయి ఓట్లు గంపగుత్తుగా గుద్దేస్తారు కానీ - నేతలు అంతా ఈజీగా మోసపోతారా ..దీనిపై శివసేన ఏ నిర్ణయం తీసుకుంటుందో ..