మునుగోడు నియోజకవర్గంలో విజయం సాధించడం లక్ష్యం కావొచ్చు. అయితే, దీనిని సాధించేందుకు ప్రచారం చేసుకోవచ్చు.. ఇంటింటికీ తిరిగి దణ్ణాలు పెట్టొచ్చు. పసుపుకుంకమలు కూడా ఇవ్వొచ్చు. కానీ, ఇప్పుడు బీజేపీ అన్ని హద్దులు దాటేసిందనే చర్చ సాగుతోంది. ఓటర్ల చేతులను కూడా వదలిపెట్టడం లేదని కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఏం జరిగింది?
మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ ఆధ్వర్యంలో కొందరు మహిళా వలంటీర్లు ఓటర్ల చేతులపై మెహందీ(కోన్) ద్వారా కమలం పువ్వు గుర్తు(బీజేపీ ఎన్నికల గుర్తు) వేయిస్తోంది. బీజేపీ నాయకులు వివిధ ప్రాంతాల నుంచి బ్యూటీషియన్లను తీసుకువచ్చి పలువురు మహిళా ఓటర్లు, వృద్ధుల చేతులపై మెహందీతో కమలం పువ్వు గుర్తును వేస్తున్నారు. మునుగోడు మండలంలోని ఒక్క పలివెల గ్రామంలోనే 250 మంది మహిళల చేతులపై కమలం పువ్వు గుర్తు వేయడం తీవ్ర వివాదానికి దారితీసింది. చేతులపై బీజేపీ ఎన్నికల గుర్తు అయిన కమలం పువ్వు ఉంటే వారు ఓటు వేయడానికి అనర్హులయ్యే అవకాశాలు ఉంటాయి.
నిజానికి ఇది ఎన్నికల నియమావళికి కూడా విరుద్ధం. పైగా.. ఇది ఎన్నికల రోజు వరకు కూడా చెరిగిపోయే పరిస్థితి ఉండదు. అత్యధికంగా ఆసరా పింఛన్లు పొందుతున్న వారి చేతులపై పువ్వు గుర్తు వేస్తూ వారు ఓటు వేయకుండా అనర్హులు అయ్యేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని అప్పుడే టీఆర్ ఎస్ నేతలు ఆరోపించారు. దీనిపై ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో మునుగోడు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సైతం ఫిర్యాదు చేశారు.
హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సతీమణి జమున సన్నిహితురాలైన ఒకరు మెదక్ జిల్లా రామాయంపేట నుంచి వచ్చి పలువురికి మెహందీతో బీజేపీ ఎన్నికల గుర్తును పెడుతున్నారని తెలిపారు. కారు గుర్తుకు కచ్చితంగా పడే వృద్ధుల ఓట్లను లక్ష్యంగా చేసుకుని బీజేపీ ఈ కుట్రలకు పాల్పడుతోందన్నారు. అదేవిధంగా వెల్మకన్నె గ్రామంలో కూడా మెహందీతో కమలం పువ్వు గుర్తును పెడుతున్నందున ఓట్లు చెల్లకపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.
ఆ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొద్ది రోజుల క్రితం కూడా చౌటుప్పల్ మండలంలో ఇదే విధంగా మహిళల చేతులపై మెహందీ కోన్‌తో కమలం పువ్వు గుర్తు వేసిన విషయం తెలిసిందే. అయితే.. అప్పట్లోనూ తీవ్ర వివాదంగా మారినా.. ఈలోగా ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారం తెరమీదికి వచ్చేస రికి అది పక్కకు పోయింది. తాజాగా ఇది సీరియస్‌గా మారింది.