జాతీయ పార్టీ అంటే... ఆ పార్టీకి కొన్ని సిద్ధాంతాలు.. వ్యవహారం.. పరిస్థితి ఉంటాయి. ప్రాంతీయ పార్టీల కంటే.. కూడా జాతీయ పార్టీలకు కొన్ని నిబద్ధతలు, నిబంధనలు.. నైతికత ఉంటాయని పేరుకూడా ఉంది. అందుకే కేంద్రంలో ఏర్పాటు చేసే ప్రభుత్వంపై ప్రగాఢ విశ్వాసం కూడా ప్రజలకు ఉంటుంది. కాంగ్రెస్ విషయాన్ని తీసుకుంటే.. కుటుంబ రాజకీయాలు చేసిందని, రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను మార్చిందని.. ఇలా.. అనేక ఆరోపణలు వున్నాయి.
ఫలితంగా దేశాన్ని అతి ఎక్కువ కాలం పాలించిన కాంగ్రెస్ అతి తక్కువ కాలంలో దుంపనాశనం దిశగా అడుగులు వేసింది. ఇక, ఇప్పుడు బీజేపీని చూస్తే.. కుటుంబ పార్టీ కాదని.. దీనికి కొన్ని సిద్ధాంతాలు ఉన్నా యని చెప్పుకొనే ఈ పార్టీ ఇప్పుడు ఏక నాయకుడి ఏలుబడిలో సిద్ధాంత దైన్యాన్ని ఎదుర్కొంటోందని.. అంటున్నారు పరిశీలకులు. ఒకప్పుడు.. వాజపేయి.. హయాంలో వ్యక్తి కాదు... పార్టీ ముఖ్యం. పార్టీకి సిద్ధాం తం ముఖ్యమంటూ.. పార్లమెంటు వేదికగానే ఆయన ప్రవచించి.. దానికి కట్టుబడ్డారు.
కానీ, ఇప్పుడు మోడీ ఏలుబడిలో బీజేపీ అంటే.. మోడీ.. మోడీ అంటే బీజేపీ తప్ప.. మరో మాటే వినిపించ డం లేదు. ఇది ఒకరకంగా కుటుంబ పార్టీల ఆధిపత్యం కన్నా ఎక్కువేనని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు ఎటు చూసినా.. ఎక్కడ విన్నా.. 'నమో నరేంద్ర' మాటే వినిపిస్తోంది. కట్టకట్టుకుని బీజేపీ నాయ కులు మొత్తం.. నరేంద్ర మోడీని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఆయనను హైలెట్ చేస్తున్నారు. ఆయన నామస్మరణలో మునిగితేలుతున్నారు.
ఇక, రాష్ట్రాల్లోనూ.. బీజేపీ పాలిత ప్రభుత్వాలు ఉన్న చోట .. మోడీతో మార్కులు వేయించుకున్న వారే.. ముఖ్యమంత్రులు.. మంత్రులు అవుతున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది.
ఈ పరిణామం.. ఇప్పటికైతే.. బాగానే ఉన్నా.. మోడీ తర్వాత.. ఎవరు..? అని చూసుకుంటే..పార్టీ కనిపించాల్సిన స్థానంలో వ్యక్తులు కనిపించడం.. పార్టీపై పైచేయి సాధించాలనే ప్రత్యర్థి పార్టీలు పోయి.. మోడీని ఓడిస్తే చాలనే దిశగా అడుగులు వేయడం ద్వారా.. చివరకు సాధించేది.. ఏంటి?
అంటే.. బీజేపీని భూస్థాపితం చేసుకోవడమే భావన వ్యక్తం చేస్తున్నారువిశ్లేషకులు. అంతిమంగా ఇలాంటి పోకడలు దేశానికి, జాతికి కూడా ప్రయోజనం చేకూర్చే అవకాశం లేదని చెబుతున్నారు. కుటుంబ పార్టీ లకన్నా.. ఏకవ్యక్తి ఆధిపత్యం మరింత ప్రమాదకరమని అంటున్నారు.