రాహుల్ కు భయపడి కరోనాను బూచీగా చూపిస్తున్న బీజేపీ ప్రభుత్వం

Update: 2022-12-23 17:30 GMT
ప్రత్యర్థులను భయపెట్టడానికి బీజేపీ చేస్తున్న చీప్ ట్రిక్స్ ఏంటో తెలుసా? అదే 'సీబీఐ, ఈడీ, ఐటీ'. ఈ మూడింటితోనే ప్రతిపక్షాలను భయపెడుతూ.. జైలు పాలు చేస్తూ.. వారి సంపదను కాజేస్తూ దారి తెచ్చుకుంటోంది. వినని నేతలపై ప్రయోగించి ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. బీజేపీపై ఎదురుతిరిగితే చాలు దేశంలో సీబీఐ, ఐటీ, ఈడీలు మీదపడిపోతున్న పరిస్థితి నెలకొంది.

ఇప్పుడు వీటితోపాటు మరొకటి వచ్చి చేరుతోంది.. అదే 'కరోనా'. అవును ప్రతిపక్ష రాహుల్ గాంధీ పాదయాత్రకు రోజురోజుకు వస్తున్న క్రేజ్ ను చూసి కల్లుకు చస్తున్న బీజేపీ అధిష్టానం ఎలాగైనా సరే ఆపాలని 'కరోనాను' తెరపైకి తెస్తోంది. రెండు మూడు రోజులు గా కేంద్రమంత్రులు కరోనా పేరిట చేస్తున్న హడావుడి.. ఈరోజు మోడీ రంగంలోకి దిగినట్టు చేస్తున్న కలరింగ్ అంతా అదే కథ మరీ..

రాజకీయం రంగు మారుతోంది. పాదయాత్రతో వస్తున్న మైలేజీని చూసి బీజేపీ తట్టుకోలేకపోతోంది. ఎలాగైనా సరే రాహుల్ పాదయాత్రను ఆపేయాలని డిసైడ్ అయ్యింది. కన్యాకుమారి నుంచి మొదలైన రాహుల్ పాదం ఇప్పుడు రాజస్థాన్ దాటి ఢిల్లీకి చేరువైంది.  కశ్మీర్ వరకూ సాగనుంది.

అయితే ఎవ్వరూ ఊహించని విధంగా రాహుల్ పాదయాత్రకు మద్దతు లభిస్తోంది. సినీ రాజకీయ , ఆర్థిక నిపుణులు సైతం రాహుల్ పాదయాత్రకు వచ్చి ఆయనతో పాదం కలిపి సపోర్ట్ చేస్తున్నారు. దక్షిణాదిన ప్రముఖ హీరోయిన్లు, కొందరు సామాజిక కారులు రాహుల్ పాదయాత్రకు సపోర్టుగా ఆయనతో కలిసి నడిచారు.

ఇక రాజస్థాన్ లో దేశంలోనే ప్రముఖ ఆర్థిక నిపుణుడు, మాజీ ఆర్బీఐ గవర్నర్ రఘురామ రాజన్ స్వయంగా రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొని నడిచారు. మోడీ సర్కార్ ఆర్థిక విధానాలను ఆయన తూర్పారపట్టారు.

ఇక ఢిల్లీలో రాహుల్ గాంధీ పాదయాత్రలో దేశంలోని దిగ్గజాలు అంతా పాల్గొనాలని చూస్తున్నారు. రాష్ట్రాల నుంచి కీలక నేతలంతా ఢిల్లీ వెళుతున్నారు. ఇలాంటి సమయంలో వచ్చే మైలేజ్ రాహుల్ కు, కాంగ్రెస్ కు మేలు చేస్తుందని గ్రహించిన బీజేపీ అధిష్టానం ఇప్పుడు కుట్ర పన్నుతోంది. ఎలాగైనా సరే కాంగ్రెస్ కు, రాహుల్ కు మైలేజ్ దక్కకుండా చేస్తోంది.

అందుకే సడెన్ గా కోవిడ్ నిబంధనలు తెరపైకి తెచ్చింది. చైనా, పాకిస్తాన్ సహా పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతుండడంతో కేంద్ర అప్రమత్తమైంది. పలు కీలక సూచనలు చేసింది. ఎక్కువమంది గుమికాకుండా నిబంధనలు తీసుకొచ్చింది. ఇది పాదయాత్ర చేసే రాహుల్ కు శరాఘాతంగా మారింది.

కరోనా పేరు చెప్పి రాహుల్ గాంధీ పాదయాత్రకి చెక్ పెట్టాలని కేంద్రం భావించినట్టు ఉంది.  భారత్ లో 95 శాతం మందికి వ్యాక్సిన్ లు వేశారు. ఇండియాలో అందరికీ ఇమ్యూనిటీ ఉంది. మన ఆహారపు అలవాట్లు కూడా కరోనాను ఎదుర్కొనే విధంగా ఉంటాయి. చైనావారిలాగా మనం నానా గడ్డి తినం కాబట్టి రోగనిరోధక శక్తి బాగానే ఉంటుంది.  చైనాలో మొదటి నుంచి కరోనా విషయంలో దాగుడుమూతలు ఉన్నాయి. కరెక్ట్ రిపోర్ట్ ఇవ్వరు. ప్రపంచాన్ని భయపెట్టాలని చేస్తున్న చైనా బూచి చూపించి ఇప్పుడు రాహుల్ గాంధీ పాదయాత్రని ఆపించాలని  చూస్తోందని కాంగ్రెస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి.

ఇప్పటిదాకా గుర్తుకురాని కరోనా తీవ్రత.. నిబంధనలు ఇప్పుడు రాహుల్ పాదయాత్ర సమయంలోనే తెరపైకి తేవడం వెనుక అసలు కారణం ఇదేనంటున్నారు. రాహుల్ పాదయాత్రకు ఇలా అడ్డుకట్ట వేసే ఎత్తుగడగా భావిస్తున్నారు. తమ అధికార ప్రవాహానికి అడ్డుగా నిలబడుతున్న రాహుల్ పాదయాత్రను ఎలాగైనా అడ్డుకోవాలని.. మామూలుగా అడ్డుకుంటే వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతోనే ఈ కుట్ర చేసినట్టు తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News