తినటం.. తాగటం మానేయండి.. పెట్రోల్ వాడటం ఆపేయండి.. బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు
అధికారం తలకు ఎక్కితే ఎలా ఉంటుందన్న దానికి నిలువెత్తు నిదర్శనంగా బీజేపీ నేతలు మారారు. గతానికి భిన్నంగా వారి మాటల్లో.. చేతల్లో ఇప్పుడు తేడా కనిపిస్తోందన్న విమర్శలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. దీనికి తగ్గట్లే వారి వ్యాఖ్యలు ఆన్ రికార్డుగా మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ వస్తూ షాకులు ఇస్తున్నాయి. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే ఒకరు చేసిన వ్యాఖ్యలపై పెను దుమారం రేగుతోంది. ఛత్తీస్ గఢ్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే బ్రిజ్ మోహన్ అగర్వాల్ వివాదాస్పద వ్యాఖ్య చేశారు.
ఇటీవల కాలంలో దేశంలో పెరిగిపోతున్న ద్రవ్యోల్బణంపై కాంగ్రెస్ నేతలు ఆందోళన చేస్తున్నారు. దీనిపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఆయన రియాక్టు అయ్యారు. అయితే.. ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు విన్న వారంతా విస్మయానికి గురవుతున్నారు. ఇంతకూ ఆయనేమన్నారంటే.. ద్రవ్యోల్బణం జాతీయ విపత్తు స్థాయికి పెరిగిందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.. ద్రవ్యోల్బణం ఎలా పెరిగిందో అలానే తగ్గుతుందన్నారు. దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సెలవిచ్చారు.
ఇక్కడితో ఆగితే రచ్చ ఉండేది కాదు. ఆయన తన వ్యాఖ్యల పరంపరను కొనసాగిస్తూ.. అనకూడని మాటల్ని అనేశారు. ‘ద్రవ్యోల్బణం అంత తీవ్ర స్థాయిలో ఉంటే తినటం.. తాగటం ఆపేయండి. అలాగే పెట్రోల్ వాడకం కూడా ఆపేయండి’ అంటూ చేసిన వ్యాఖ్యపై పెను దుమారం రేగుతోంది. ఇప్పటికే పెరిగిన నిత్యవసరాలు.. పెట్రోల్.. డీజిల్ ధరలతో సామాన్యుడు.. మధ్యతరగతి జీవులు తీవ్ర ఆగ్రహంతో ఉన్న వేళ.. పుండు మీద కారం జల్లినట్లుగా బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు ఉన్నాయని చెబుతున్నారు. తన వ్యాఖ్యలు పెనుదుమారం రేగటంతో..చేసిన తప్పు గుర్తించిన సదరు ఎమ్మెల్యే.. తానేదో న్యూస్ రిపోర్టర్లతో సరదాగా చేసిన వ్యాఖ్యల్ని వివాదాస్పదం చేస్తున్నారంటూ మీడియాపై ఆయన ఫైర్ అయ్యారు. అయితే ప్రజలు.. లేదంటే మీడియా.. విరుచుకుపడటానికి ఉత్తినే దొరికేస్తారుగా!