విభజన సందర్భంగా ఏపీకి ఇచ్చిన ప్రత్యేక హోదా హామీపై గడిచిన నెలలో చోటు చేసుకుంటున్న పరిణామాలు తెలిసిందే. మోడీ సర్కారు వ్యవహరిస్తున్న తీరుకు ఏపీ ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నా.. దానిపై ఒక్క మాటంటే ఒక్క మాట కూడా మాట్లాడకుండా మిన్నకుండిపోయారు. కేంద్ర మంత్రిమండలి నుంచి తమ పార్టీ మంత్రుల్ని ఉపసంహరించుకుంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న నిర్ణయం మోడీని కాస్త కదిలించింది. ఆయనే స్వయంగా ఫోన్ చేసి.. బాబును కాస్త ఆగాలని.. త్వరపడి నిర్ణయం తీసుకోవద్దని చెప్పటం.. దానికి బాబు చెప్పిన సమాధానంతో మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు.
ఈ పరిణామం బీజేపీని ఏపీలో భారీ డ్యామేజ్ చేసింది. ఏపీకి ఇవ్వాల్సిన నిధులు.. హామీలపై స్పందించని మోడీ సర్కారు తాజాగా ఆసక్తికర నిర్ణయాన్ని తీసుకుంది. ఆంధ్రా ప్రాంతానికి చెందిన బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావును రాజ్యసభకు పంపుతూ నిర్ణయం తీసుకుంది. ఏపీ నుంచి రాజ్యసభకు పంపేంత బలం మోడీ పరివారానికి లేకపోవటంతో ఆయన్ను ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎంపిక చేసినట్లు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వెల్లడించారు.
జీవీఎల్ నరసింహారావుకు 1998 నుంచి బీజేపీతో మంచి సంబంధాలు ఉన్నాయి. పార్టీ జాతీయ కార్యవర్గసభ్యుడిగా.. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మీడియా సలహాదారుగా ఆయన పని చేశారు. ప్రధాని పదవికి మోడీ సూట్ అవుతారని.. ఆయన ఎన్నిక అవుతారని మొదట అంచనా వేసింది ఆయనే కావటం గమనార్హం. ఏపీకి చెందిన టీడీపీ నేతలు అశోక్ గజపతి రాజు.. సుజనా చౌదరిలు తమ పదవులకు రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయనకు పదవి పక్కా అన్న అంచనాలు వ్యక్తమయ్యాయి. దీనికి తగ్గట్లే తాజాగా అమిత్ షా ఆయన్ను రాజ్యసభకు పంపుతున్నట్లుగా ప్రకటించారు. ఆంధ్రా ప్రాంతానికి అవసరమైన నిధులు.. హోదాను ఇవ్వకుండా.. అదే ప్రాంతానికి చెందిన వ్యక్తికి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చినంత మాత్రాన కోట్లాది మంది ప్రజలకు న్యాయం జరిగిపోదు కదా?