బీజేపీకి వ్యతిరేకంగా ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రచారం చేయడంపై ఆ పార్టీ భగ్గుమంటోంది. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా టీడీపీ నేతలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ మీద టీడీపీ దుష్ప్రచారం ఫలించదని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కర్ణాటకలో తెలుగు ప్రజలు నీరాజనం పట్టడం చూసి చంద్రబాబు తట్టుకోలేకపోయారని వ్యాఖ్యానించారు. అశోక్ బాబు, ఉద్యోగుల సంఘాల నాయకులు కర్ణాటక ఎన్నికల్లో దుష్ప్రచారం చేయడానికి వెళ్లారని ఆరోపించారు. ఇలాంటి దుష్ప్రచారం వలన చంద్రబాబుకు ఎన్నికల సమయంలో ఇబ్బందులు తప్పవని వ్యాఖ్యానించారు.
కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలను రాష్ట్ర ప్రభుత్వం పథకాలుగా మార్చుకొని చంద్రబాబు బ్రాండింగ్ చేసుకున్నారని జీవీఎల్ ఆరోపించారు. అత్యధిక శాతం కేంద్ర ప్రభుత్వం ఇల్లు మంజూరు చేస్తే, చంద్రబాబు ప్రభుత్వం పథకం కింద చేసుకున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో పని ఎక్కడ కూడా జరగడం లేదని, ప్రచారం మాత్రం చేసుకుంటున్నారని ఆరోపించారు. ప్రజాధనాన్ని ఉపవాసాలు, విలాసాలకు, ర్యాలీలకు ఉపయోగిస్తున్నారని విరుచుకుపడ్డారు. విజయవాడలో చంద్రబాబు చేపట్టిన దీక్షకు రూ.30 కోట్లు ఖర్చు అని ప్రకటించారని అయతే అది దాదాపు 100 కోట్లకు పై మాటేనని నరసింహారావు అన్నారు. రాయలసీమలో ఇండస్ట్రీలు తెచ్చాం అని అంటున్నారుని, పెట్టుబడులు రావడానికి రాష్ట్ర ప్రభుత్వమే అని గొప్పలు చెప్పుకుంటున్నారని, చంద్రబాబు రాష్ట్రానికి ఎలాంటి పెట్టుబడులు,పరిశ్రమ లు తెచ్చారో ప్రజలకు వివరణ ఇవ్వాలని జీవీఎల్ డిమాండ్ చేశారు. అనేక పరిశ్రమలుకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వవడం వలనే రాష్ట్రానికి వచ్చాయని, దానిని టీడీపీ పార్టీ గొప్పలు చెప్పుకోవడం సిగ్గు చేటని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను పర్యటనలకు, విలాసాలకు దీక్ష లకు, విదేశీ పర్యటనలకు వాడుకుంటున్నారని జీవీఎల్ ఆరోపించారు. విలాసాలు కోరుకుంటున్న ప్రభుత్వాన్ని ప్రజలు సహించరని తెలిపారు. రాష్ట్రంలో అవినీతి జరిగిన మాట వాస్తవమని ఆయన స్పష్టం చేశారు. అవకతవకలు మీద అసెంబ్లీలో ,పార్లమెంట్ లో, వివిధ చర్చలలో నిలదిస్తామని తెలిపారు. అవినీతి పై వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వాని ఎండగడతామని ప్రకటించారు. తామేము చెప్పినట్లు ప్రజలు వింటారని బాబు అహంకారమని మండిపడ్డారు. బాబు విడిపోవడం వల్ల తమకు ఎలాంటి నష్టం లేదని అన్నారు. చంద్రబాబుకు పని మీద శ్రద్ధ లేదని, ప్రచారం మీద మాత్రమే శ్రద్ధ ఎక్కువని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పరిపాలన లో తప్పిదాలు చాలా ఉన్నాయని, రాబోయే కాలంలో అవి బయటకు వస్తాయన్నారు. తమ మీద బురద చల్లితే అది బాబు మీదే పడుతుందని అన్నారు. అసెంబ్లీని ఉపన్యాసాలు ఇవ్వడం కోసం వాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు.