తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఇరకాటంలో పడేసేలా బీజేపీ నేతలు అడుగులు వేస్తున్నారు. దాదాపు 15వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూ కుంభకోణం విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ బంధువుల పాత్ర ఉందని పలువర్గాల నుంచి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కమళనాథులు రంగంలోకి దిగారు. అవినీతి వివరాలను కేంద్ర ప్రభుత్వానికి చేరవేశారట. ఈ విషయాన్ని బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు తెలిపారు. వేల కోట్ల రూపాయల విలువ చేసే మియాపూర్ భూకుంభ కోణం వివరాలను కేంద్రానికి పంపించామని, విచారణ జరిపించాలని కోరామని ఆయన వెల్లడించారు.
వేలకోట్ల రూపాయల విలువ చేసే భూముల కుంభకోణంపై ముఖ్యమంత్రి కేసీఆర్ మౌనంగా ఉన్నారంటే, కుంభకోణాన్ని అంగీకరించినట్లేనన్న విషయం స్పష్టమవుతోందని కృష్ణసాగర్ రావు అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సహా హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు మియాపూర్ అవినీతి వివరాలను చేరవేశామని తెలిపారు. తన మంత్రి వర్గంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మహమూద్ అలీ తప్పు చేశారని అంగీకరిస్తున్న సీఎం ఆయనను మంత్రివర్గం నుండి తప్పించే విషయంలో ఎందుకు వెనక్కు తగ్గుతున్నారని ప్రశ్నించారు. గోల్డ్‌స్టోన్ ప్రసాద్ ను ప్రభుత్వం కావాలని కాపాడుతున్నట్లు స్పష్టమవుతోందని కృష్ణసాగర్ రావు విమర్శించారు.
నేరస్తుల పాలిట సింహస్వప్నంగా ఉంటామని చెప్పే సీఎం కేసీఆర్ ఇంతవరకు ప్రసాద్ కు లుకౌట్ నోటీసులను ఎందుకు జారీ చేయించలేదో చెప్పాలని కృష్ణసాగర్ రావు నిలదీశారు. టీఆర్ ఎస్ నేతలు రాష్ట్రంలోని భూములను దోచుకుంటున్నారని, దోచుకున్న భూ ములను స్వాధీనం చేసుకొని పేదలకు పంచాలని ఆయన డిమాండ్ చేశారు. అసమర్థత, అవినీతి కలిస్తే కేసీఆర్ పాలన అన్న విషయం స్పష్టమవుతుందన్నారు. గ్రూప్ 2 పరీక్ష విషయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశం ప్రభుత్వానికి చెంప పెట్టులాంటిదని కృష్ణసాగర్‌రావు వ్యాఖ్యానించారు. టీఎస్ పీఎస్ సీలో భారీ ఎత్తున అక్రమాలు, అవినీతి జరుగుతుందని ఆయన ఆరోపించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/