తెలుగుదేశం పార్టీతో రాజకీయ బంధాన్ని కొనసాగిం చడం మినహా మరో మార్గం లేదని భారతీయ జనతా పార్టీ అభిప్రాయపడుతోంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ - తెలంగాణల్లో బిజెపిని బలమైన రాజకీయ శక్తిగా తయారు చేసుకోవాలన్న ఉద్దేశంతో సొంతంగా ఎదిగే ప్రయత్నం చేస్తామని, ఇకపై తెలుగు రాష్ట్రాలలో జరిగే ఏ ఎన్నికలలోనూ ఎవరితోనూ పొత్తు పొత్తుపెట్టుకోకుండా ఒంటరిగానే పోటీ చేస్తామని పలు సందర్భాలలో ప్రకటనలు గుప్పించిన బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు స్వరంలో శుక్రవారం కొత్త మాటలు చెప్పారు. గతంలో ఎగిరెగిరిపడిన ఆయనకు ఇప్పుడు తత్వం బోధపడినట్లుగా అనిపిస్తోంది. జాతీయ నాయకత్వం గతంలో తీసుకొన్న నిర్ణయం తెలంగాణ విషయంలో యధావిధిగా అమలవుతుందని, అయితే, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అధికార తెలుగు దేశం పార్టీతో ప్రస్తుతమున్న పొత్తును కొనసాగిస్తామని మురళీధరరావు స్పష్టం చేశారు. బిజెపి - తెలుగు దేశం పార్టీలు ఎన్ డిఎ కూటమిలో భాగస్వాములుగా కేంద్రంలో - రాష్ట్రంలో అధికారాన్ని పంచుకొంటున్న విషయం తెలిసిందే. అవిభక్త రాష్ట్ర విభజన సమయంలో అప్పటి ప్రధాని పార్లమెంట్ లో చేసిన ప్రత్యేక హోదా ప్రకటనను అమలు చేయడంలో కొన్ని సమస్యలున్నాయని ఆయన అంగీకరించారు. అయితే, ఏపీకి ప్రత్యేక హోదాకు మించిన ప్రయోజనాలు సిద్ధించబోతున్నాయని ఊరించారు. అంతేకాదు... ఏపీ బీజేపీలో ఎగిరెగిరిపడుతున్న సోము వీర్రాజుకు ఆయన పరోక్ష హెచ్చరికలు జారీచేశారు.
ఇటీవల టిడిపి మద్దతుతో శాసనమండలి సభ్యునిగా ఎన్నికైన సోము వీర్రాజు తెలుగు దేశం పార్టీపై, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతుండడం బిజెపి-టిడిపి పొత్తుకు ఎలాంటి నష్టం కల్గించదని మురళీధరరావు అభిప్రాయపడ్డారు. రెండు పార్టీల నాయకత్వాల మధ్య స్పష్టమైన అవగాహన ఉందని, కేంద్రంలో, రాష్ట్రంలో అధికారాన్ని పంచుకొంటున్న రెండు పార్టీల మధ్య రాజకీయ బంధం ఇలాగే కొనసాగుతుందని చెప్పారు. కేంద్రం - రాష్ట్ర ప్రభుత్వాల పనితీరు గురించి రాష్ట్ర స్థాయిలో రెండు పార్టీలలోని కొందరు నేతలు తొందరపడి పత్రికలకెక్కుతున్న మాట వాస్తవమేనని, అయితే, తమ పార్టీకి సంబంధించినంత వరకూ పార్టీ క్రమశిక్షణను అతిక్రమించి వ్యవహరించడాన్ని సహించబోమని పరోక్షంగా సోము వీర్రాజు వైఖరిని ఆయన తప్పుబట్టారు. వచ్చే ఎన్నికల్లోనూ ఏపీలో టీడీపీతో కలిసే సాగుతామని ఆయన చెబుతున్నారు.