తెలంగాణలో ఎన్నికల వేడిని మరింత పెంచేందుకు బీజేపీ నేతలు ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటనతో హీట్ పెంచేందుకు సిద్ధమైన బీజేపీ ఈ క్రమంలో తమ మాటల తీవ్రతను మరింత పెంచుతోంది. అమిత్ షా పర్యటన నేపథ్యంలో బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి మురళీధర్ రావు మీడియాతో మాట్లాడుతూ గులాబీ దళపతి కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చేందుకు టీఆర్ ఎస్ కు ప్రజలు పట్టం కట్టారని - కానీ ఈ నాలుగేళ్లుగా అనేక హామీలు విస్మరించారని వెల్లడించారు. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమయ్యారని - ఈసారి ఎన్నికల్లో కేసీఆర్ కు ఇదే ప్రధాన ప్రశ్న అని మురళీధర్ రావు తెలిపారు. ``అసలు ఎందుకు ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారు? ఇంత ఖర్చు ఎందుకు అనే ప్రశ్నకు కేసీఆర్ సమాధానం చెప్పడంలేదు. తన మాటలను నమ్మించలేకపోతున్నారు. కేసీఆర్ లాజికల్ గా ఆలోచించే వ్యక్తి కాదు. గతంలో అనేక సార్లు రాజీనామాలు చేశారు. అప్పుడు చేయడం వేరు కానీ ఇప్పుడు అసెంబ్లీ రద్దు చేయడం కేసీఆర్ బాధ్యతారాహిత్యమైన చర్య`` అని మండిపడ్డారు.
దళితులకు మూడెకరాల భూ పంపిణీ - అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు - మాదిగ భవన్ అన్నారని అయితే ఎక్కడ చేయలేదని మురళీధర్ రావు ప్రశ్నించారు. ``ఇసుక మాఫియాతో ప్రభుత్వం నడుస్తోంది. 10 శాతం మంది ఎస్టీలు ఉన్నారు కానీ ప్రభుత్వం అంతకంటే ఒక ముందడుగు వేసి 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి మోసపూరిత మాటలను చెప్పారు. తద్వారా రిజర్వేషన్లు ఇవ్వలేదు. రైతాంగాన్ని విస్మరించింది. రైతు ఆత్మహత్యలపై లెక్కలు తారుమారు చేస్తున్నారు. కేంద్రం వ్యవసాయంపై అనేక పథకాలు పెడితే అమలు చేయడం లేదు. రైతు వ్యతిరేక ప్రభుత్వం టీఆర్ ఎస్ ప్రభుత్వం. ఉద్యోగాల విషయంలో ఇప్పటి వరకు టీఆర్ ఎస్ కు క్లారిటీ లేదు. రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు.
కానీ 37 వేళా ఉద్యోగాలే ఇచ్చారు. టీఆర్ ఎస్ ప్రభుత్వంపై బీజేపీ ఛార్జ్ షీట్ వేస్తాం`` అని వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ అంచనాలు తారుమారు అవుతాయని మురళీధర్ రావు జోస్యం చేప్పారు. మోడీ తెలంగాణకు సహాయం చేయడానికి అన్నివిధాల సిద్ధంగా ఉన్నారు, రేపు అమిత్ షా పర్యటనలోఅన్నింటి సమాధానం ఇస్తారు అని వెల్లడించారు.
దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగిన ఓటమి పాలైన కాంగ్రెస్ ఇప్పుడు ఎలా తెలంగాణలో గెలుస్తుందని మురళీధర్ రావు ప్రశ్నించారు. `` కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో ఈ నాలుగేళ్ల లో ఓటమి చవిచూసింది. రాబోయే అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలువదు. మావోయిస్టులతో కాంగ్రెస్ పార్టీ కలుస్తుందా? అధికారంలో లేకపోతే కాంగ్రెస్ మావోయిస్టలతో కలుస్తారా? అధికారం దాహంతో ఎవరితోనైనా కాంగ్రెస్ కలుస్తుంది. మోడీని ఓడించేందుకు రాహుల్ గాంధీ పాకిస్థాన్‌తో కూడా కలుస్తారు`` అని ప్రశ్నించారు. టీఆర్ ఎస్ ను ఓడించాలని కాంగ్రెస్ కు ఓటేయవద్దని - టీఆర్ ఎస్-కాంగ్రెస్-ఎంఐఎం ఈ మూడు ఒక్కటే దారి అని మురళీధర్ రావు సూచించారు.