రాష్ట్ర విభజన ఎఫెక్ట్ ఎలా ఉంటుందన్నది ఏపీ రాష్ట్ర విభజన తర్వాత తెలుగు ప్రజలకే కాదు.. రాజకీయ పార్టీలకు చాలా బాగానే అర్థమైంది. ఇదే సమయంలో కొత్త రాష్ట్రాల కోసం డిమాండ్లు కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. ఏపీ అనుభవం తర్వాత కొత్త రాష్ట్ర ఏర్పాటు విషయంలో జాతీయ పార్టీలు ఆచితూచి అడుగులు వేస్తున్న పరిస్థితి.
ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త రాష్ట్రాల ఏర్పాటు వెనువెంటనే సాధ్యం కాదన్న వాదన బలంగా వినిపిస్తున్న వేళ.. బీజేపీ ప్రధాన కార్యదర్శి.. మురళీధరరావు ఆసక్తికర వ్యాఖ్య ఒకటి చేశారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనే కొత్త రాష్ట్రాల ఏర్పాటు ఆగిపోలేదని.. రానున్న రోజుల్లో మరిన్ని కొత్త రాష్ట్రాలు ఏర్పడతాయని చెప్పుకొచ్చారు. జాతీయ పార్టీల అవసరం దేశానికి చాలానేఉందని చెప్పిన మురళీధర్‌రావు.. కొత్త రాష్ట్రాల ఏర్పాటు మీద చాలానే మోజు ప్రదర్శిస్తున్నారు. అధికారపక్షం నేతే.. రాష్ట్రాల విభజన మీద తీపి కబురు చెప్పిన నేపథ్యంలో.. ఉద్యమకారులు గొంతులు సవరించుకొని.. రోడ్ల మీదకు వచ్చేస్తే ఫలితం దక్కే అవకాశం ఉంటుందేమో. మొత్తానికి రాష్ట్రాల్ని మరిన్ని ముక్కలు కావటం ఖాయమన్న మాట.