అసహనం అంటూ ఆ మధ్య దేశ వ్యాప్తంగా రచ్చ రచ్చగా మారిన సందర్భంగా.. విషయంలోని రాజకీయాన్ని అర్థం చేసుకోకుండా.. తన భార్య పడిన ఆందోళనను మీడియా ఎదుట చెప్పేసి బాలీవుడ్ దిగ్గజ నటుడు అమిర్ ఖాన్ ఎన్ని విమర్శల పాలయ్యాడో తెలిసిందే. దేశంలో అసహనం పెరిగిందని.. ఈ నేపథ్యంలో దేశం విడిచి వెళ్లిపోవాలన్న భావనను తన భార్య వెల్లడించిందంటూ వ్యాఖ్యలు చేశారు.
దీనిపై పెద్ద రచ్చే చోటు చేసుకుంది. అయితే.. ఈ మధ్య దేశ విశిష్టత గురించి ఆటో డ్రైవర్ కు అమిర్ చెప్పిన ఉదంతంపై బీజేపీ నేత రామ్ మాధవ్ రియాక్ట్ అయ్యారు. దేశ ప్రతిష్ఠను ఎలా కాపాడాలన్న అంశం గురించి ఆటోవాలాకు చెబితే సరిపోదని.. ఆ విషయాన్ని అమిర్ ఖాన్ తన భార్యకు కూడా చెబితే మంచిదన్న మాటను చెప్పుకొచ్చారు. ఎవరూ అవార్డుల్ని వాపసు చేయాల్సిన అవసరం లేదని.. ప్రతి ఒక్కరి ప్రయోజనాల్ని కాపాడి తీరుతామన్న మాటను చెప్పిన రాం మాధవ్ తీరు చూస్తే.. అమిర్ ఖాన్ ను ఇప్పట్లో వదిలేటట్లు లేరన్న భావన కలగటం ఖాయం.