రైతు ఉద్యమం వెనక కుట్ర..! రాములమ్మ ఫైర్​..!

Update: 2021-02-05 13:50 GMT
వ్యవసాయచట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న రైతు ఉద్యమంపై బీజేపీ నేత విజయశాంతి స్పందించారు. రైతు ఉద్యమం దారి తప్పిందని ఆమె అభిప్రాయపడ్డారు. ఒక్క ఫోన్ కాల్​ చేసినా.. చర్చలకు సిద్ధమని.. ఏడాదిపాటు ఈ చట్టం అమల్లో ఉండదని స్వయంగా ప్రధానే ప్రకటించినా రైతు సంఘాలు వెనక్కితగ్గడం లేదంటే... వారి వెనక ఎవరో ఉన్నారని అర్థమవుతుందని ఆమె పేర్కొన్నారు.

మన దేశంలో జరుగుతున్న ఉద్యమంపై విదేశాల వాళ్లు స్పందించడం ఏమిటని ఆమె ప్రశ్నించారు.
రిపబ్లిక్​ డే వరకు రైతు సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరుపుతూనే ఉందని ఆమె పేర్కొన్నారు. అయితే రైతులు మాత్రం మొండిగా వ్యవహరిస్తున్నారన్నారు. ఎర్రకోటపై ఆందోళనకారులు వివాదాస్పద జెండాలు ఎగరేస్తే.. ఈ విషయం మాకు సంబంధం లేదని రైతు సంఘాలు ఎలా అంటారని ఆమె ప్రశ్నించారు. ఉద్యమం వారి చేతుల్లో కూడా లేదా? అని ఆమె పేర్కొన్నారు.
‘చట్టాలు రద్దు చేయండి .. లేదంటే గద్దె దిగండి’ అంటూ రైతుసంఘాలు బెదిరింపు ధోరణిలో మాట్లాడుతున్నాయని పేర్కొన్నారు.

‘‘ఇవి రెతు సంఘాల నేతల మాటలా? లేదా వెనుక నుండి ప్రేరేపిత విరోధులు అనిపిస్తున్నారా? అని దేశ ప్రజలు ఆలోచిస్తున్నారు. ఏడాదిన్నరపాటు అమలు కాని.. అమలుకు రాని చట్టాలపై ఇప్పుడెందుకు ఇంత యాగీ పెట్టి ఆగం చేస్తున్నారు? ప్రభుత్వం ఫోన్ కాల్ దూరంలో చర్చలకు సిద్ధంగా ఉండగా... ఎందుకు ఈ ధోరణి ఎంచుకున్నట్లు?’’ అని విజయశాంతి ప్రశ్నించారు.
Tags:    

Similar News