బండి సంజయ్ తో పని చేయలేము!

Update: 2022-11-09 13:30 GMT
మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటమితో బీజేపీలో లుకలుకలు మొదలయ్యాయి. బీజేపీ నేతల ప్రచార ఆర్భాటం.. వ్యక్తిగత మైలేజ్ కోసమే పనిచేసిందని.. పార్టీని గెలిపించలేకపోయిందన్న వాదన వినిపిస్తోంది.  మునుగోడులో ఓటమితో బీజేపీ పోస్ట్ మార్టం మొదలుపెట్టింది. అసలు ఓటమికి కారణం ఏంటని ఆరాతీస్తోంది. ఈ పోస్ట్ మార్టంలో బీజేపీ నేతల మధ్య హాట్ హాట్ మీటింగ్ జరిగిందంట..

ఈ పోస్టుమార్టం మీటింగ్ లో మునుగోడులో ఓటమికి మీరంటే మీరే కారణమని నేతలు వర్గాలుగా విడిపోయారని సమాచారం. ఈ మేరకు  ఈటల రాజేందర్, బండి సంజయ్ లు రెండు గ్రూపులుగా విడిపోయారని టాక్ నడుస్తోంది.  

తెలంగాణ బీజేపీలో ఇప్పుడు సీనియర్ కిషన్ రెడ్డి వర్గంతోపాటు కొత్తగా రాష్ట్ర అధ్యక్షుడైన బండి సంజయ్ వర్గం ఉందన్నది ఆ పార్టీ ఇన్ సైడ్ టాక్. మొదటి నుంచి ఈ రెండు వర్గాలు విడిపోయి ఆధిపత్యం కోసం ట్రై చేస్తున్నారన్న ప్రచారం ఉంది. ఇప్పుడు బండి సంజయ్ హవానే బీజేపీలో నడుస్తోంది. తెలంగాణలో వరుస విజయాలు, పాదయాత్రతో హైకమాండ్ దృష్టిలో బండి సంజయ్ హీరోగా మారాడు.

ఇక హుజూరాబాద్ గెలుపుతో ఈటల గ్రాఫ్ పెరిగింది. కేసీఆర్ తో ఢీ అంటే ఢీ అనే నేతగా ఫోకస్ అయ్యారు. పైగా బీసీ నేత కావడంతో గుర్తింపు ఉంది. నీట్ఇమేజ్ ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకే చెందిన బండి సంజయ్, ఈటలలు ఇప్పుడు పోటీగా భావిస్తూ పంతాలకు పోతున్నారని అంటున్నారు. ముఖ్యంగా బండి సంజయ్ తనకు పోటీగా ఈటల ఉండడాన్ని అస్సలు భరించలేకపోతున్నారని.. అందుకే దూరం పెడుతున్నారన్న టాక్ ఉంది.

ప్రస్తుతం ఈటల బీజేపీలో చేరికల కమిటీ చైర్మన్ గా ఉన్నారు. ఆయనకు చెప్పకుండానే బండి సంజయ్ పలువురిని ఢిల్లీ పెద్దల వద్దకు తీసుకెళ్లి బీజేపీలో చేర్పించారు. దీంతో ఈటల నొచ్చుకున్నాడని.. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లోనూ ఈటలని సస్పెండ్ చేస్తే బండి సంజయ్ వర్గం అస్సలు పట్టించుకోలేదన్న టాక్ ఉంది.

దీంతో బండి, ఈటల మధ్య ఇప్పుడు అనుకున్నంత సఖ్యత లేదని.. ఈటలను పార్టీలో ఒంటరిని చేసే ప్రయత్నాలు సాగుతున్నాయన్న ప్రచారం రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతోంది. మునుగోడులోనూ ఈటల రాజేందర్ వ్యూహాలను బండి సంజయ్ అమలు చేయలేదని.. తన సొంత ఎజెండా అమలు చేశారని.. అందుకే బీజేపీ ఓడిపోయిందని పలువురు కామెంట్ చేశారట.. పాదయాత్ర సహా ఒంటరిగా బండి సంజయ్ ఇమేజ్ పెంచుకునే చర్యలే బీజేపీని మునుగోడులో ఓడించాయని టాక్ నడుస్తోంది. బండి , ఈటల వర్గాలు మీరంటే మీవల్లేనని మునుగోడులో ఓడిపోయామని వర్గాలుగా విడిపోయి మీటింగ్ లో తిట్టిపోసుకున్నారని సమాచారం. మరి ఇది నిజమా? లీకులు అబద్ధమా? అన్నది తెలియాల్సి ఉంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News