రాజకీయాలన్నా - రాజకీయాల్లో పార్టీలు తీసుకునే ప్రతీ నిర్ణయం అయినా అదంతా క్రెడిట్ గేం అనే విషయం తెలిసిందే. చేసే ప్రతీపనికీ క్రెడిట్ కావాలని - అదే రాజకీయాలకు ఇందనం అని ప్రతీ పార్టీ భావిస్తుంటాయి. ఇదేమీ తప్పుకూడా కాదు!! అయితే ఈ క్రమంలో తీసుకున్న నిర్ణయం సజావుగా సాగి సక్సెస్ అయితే తమ ఖాతాలో వేసుకోవడం - ఫెయిలయ్యి ప్రజలు ఇబ్బంది పడిన పక్షంలో దాన్ని తమ భుజాలపైనుంచి దించేసుకోవడం చేస్తుంటారు కొంతమంది పెద్దలు. అయితే ఇదే కార్యక్రమానికి తాజాగా తెరలేపుతున్నారు కొందరు బీజేపీ నేతలు!
పెద్దనోట్ల రద్దు వ్యవహారానికి సంబందించిన ప్రతీ విషయాన్ని మోడీ అద్భుతమైన నిర్ణయంగా, దేశాన్ని మార్చే ప్రక్రియగా ప్రకటించుకున్న బీజేపీ నేతల్లో కొంతమంది ఇప్పటికే రెండోమాట మాట్లాడేస్తున్నారు. మోడీ తీసుకున్న నిర్ణయం అద్భుతమైనది అని అంటూనే... బ్యాంకుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఆర్బీఐ పరిదిలోకి వస్తాయని నేరుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు! నిర్ణయం తీసుకునేవారికి, ఆ నిర్ణయాన్ని అమలుపరిచే విషయంలో నాలెడ్జ్ ఉండకపోయినా, ఆ అమలుకు సంబందించిన జాగ్రత్తలు తీసుకునేలా చేయడంలో పరిపాలనా సామర్ధ్యం ఉండాలనే విషయం అందరూ ఒప్పుకునేదే. ఈ విషయంలో పొరపాటులు జరిగిన సంగతి తెలిసిందే. దీంతో ప్రజలు ఇబ్బందులు పడటం, ఒక్కసారిగా దేశం మొత్తం ఒకే సమస్యపై చర్చించుకోవడం, అందులో అధికశాతం ప్రజలు ఈ నిర్ణయం అమలు విషయంలో అసంతృప్తిని వ్యక్తపరచడంతో బీజేపీ నేతల వాయిస్ మారుతుంది.
ఇప్పటికే ఇది నల్లధనంపై పూర్తి యుద్ధం కాదని, ఆ యుద్దానికి సంబందించిన తొలి అడుగు మాత్రమే అని సన్నాయినొక్కులు మొదలెట్టేసిన నేతలు... తాజాగా ఫలితం ఆర్బీఐ ఖాతాలోకి పంపుతున్నారు! ఈ విషయంపై ఆర్బీఐ చర్యలు చేపట్టిందని, ఎంక్వైరీలు వేసిందని చెబుతున్న బీజేపీ నేతలు చిన్న చిన్న సమస్యలు రావడం సహజం అని... ఆ భారీ సమస్యలను కూడా చిన్న చిన్న సమస్యలుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు!!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/