మిత్రపక్షంగా ఉన్న బీజేపీ-టీడీపీల మధ్య మరో అంతర్గత చర్చ మొదలైంది. ఏపీకి ప్రత్యేక హోదా వల్ల జరిగే మేలు గురించి పూర్తిగా అధ్యయనం చేయకుండానే - తమకు వ్యతిరేకంగా ప్రచారం చేయడాన్ని బీజేపీ జీర్ణించుకోలేకపోతోంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై తెదేపా చేస్తున్న ప్రచారం వెనుక మోదీని మళ్లీ ప్రధాని కాకుండా జరుగుతున్న కుట్ర ఉందా? మిగిలిన రాష్ట్రాల్లో కూడా హోదా ఉద్యమాలకు ఊపిరిపోసే వ్యూహం ఉందా? ఒక వేళ హోదా ఇస్తే ఎంతమేరకు నిధులు వస్తాయన్న దానిపై పొంతన లేని లెక్కలు చెబుతున్న తెదేపా నాయకత్వం - తెలంగాణ మాదిరిగా హోదాను సెంటిమెంటుగా మార్చే రాజకీయ ఎత్తుగడలో ఉందా?..అన్న సందేహాలతో బీజేపీ నేతల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది
ప్రత్యేక హోదాపై తెదేపా చేస్తున్న ప్రచార వ్యూహంపై బీజేపీలో విశ్లేషణ మొదలయింది. హోదాపై తెదేపా నాయకత్వానికి సరైన అవగాహన లేదని, అయినా సరే ఆ అంశాన్ని తెలంగాణ మాదిరిగా సెంటిమెంటుగా మార్చి మోడీని అప్రతిష్ఠపాలు చేసే రాజకీయ ఎత్తుగడకు పాల్పడుతోందన్న అనుమానం బీజేపీలో వ్యక్తమవుతోంది. అందుకే దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆ పార్టీ నిర్ణయించింది. ప్రత్యేక హోదా వస్తే ఏడాదికి 2500 కోట్లు వస్తాయని కేంద్రమంత్రి సుజనాచౌదరి - 3500 కోట్లు వస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా చెప్పిన విషయాన్ని బీజేపీ నేతలు ప్రస్తావిస్తున్నారు. హోదా వస్తే 6వేల కోట్లు వస్తాయని గతంలో చంద్రబాబు అసెంబ్లీ వేదికగా చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కింద 6 వేల కోట్లు వస్తాయని ఏపీ సీఎం చంద్రబాబు శాసనమండలిలో లెక్క చెప్పినప్పుడు, బీజేపీ సభ్యుడు సోము వీర్రాజు స్పందించి మీ లెక్కలు నిజమనుకున్నా రాష్ట్రానికి ఇప్పటికే 60 వేల కోట్లు ఇచ్చింది కదా? విభజనలో లేనివి కూడా కేంద్రం ఇచ్చింది కదా అని గతంలోనే ప్రశ్నించిన వైనాన్ని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఏదో ఒకటి మాట్లాడి జనంలో సెంటిమెంటును పోగేయాలన్న రాజకీయ ఎత్తుగడే తప్ప - వాస్తవాలు చెప్పడం లేదని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. ఎన్డీఏ సర్కారుపై పరోక్షంగా చేస్తున్న ఈ కుట్రను అడ్డుకుని జనంలోకి తీసుకువెళతామంటున్నారు.
2013-14లో కాంగ్రెస్ హయాంలో రాష్ట్రాలు - కేంద్రపాలిత ప్రాంతాల ప్రణాళిక వ్యయాల కోసం కేవలం 1,12,849 కోట్లు కేటాయించి ఇందులో కేవలం 7692.68 కోట్ల రూపాయలను ప్రత్యేక హోదా ఉన్న 11 రాష్ట్రాలకు పంపిణీ చేశారని బీజేపీ నేతలు చెప్తున్నారు. ఆ ప్రకారంగా ఒక్కో రాష్ట్రానికి దక్కింది 700 కోట్లని వారు గుర్తుచేస్తున్నారు. కేంద్రం ఇప్పుడు అంతకంటే ఎక్కువ నిధులు ఇస్తున్నా ఆ విషయాన్ని చెప్పటం లేదన్నారు. హోదా విషయంలో తెదేపా నాయకత్వం వ్యూహాత్మకంగా మోదీని దెబ్బతీసే ప్రయత్నం చేస్తోందని బీజేపీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. హోదా వస్తే రాష్ట్రానికి ఎంత నిధులు వస్తాయన్నది అంచనా వేయకుండా, నివేదికలు తెప్పించుకోకుండా బట్టకాల్చి వేసే రాజకీయ ఎత్తుగడకు పాల్పడుతోందని పార్టీ నేతలు మండిపడుతున్నారు. అందుకే తమపై జరుగుతున్న కుట్రను వివరిస్తామని స్పష్టం చేస్తున్నారు.