దేశంలోని రాజకీయ పార్టీల్లో బీజేపీకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకో తెలియదు కానీ కళారంగాలు - ఇతర సృజనకారులు - క్రీడాకారులు వంటివారంతా ఆ పార్టీవైపే ఆకర్షితులవుతుంటారు. బీజేపీ కూడా రాజకీయేతర రంగాల్లో లబ్ధప్రతిష్ఠులుగా ఉండి తమ పార్టీలోకి వచ్చినవారిని బాగా చూసుకుంటుంది. ఏమాత్రం అవకాశం ఉన్నా వారికి టిక్కెట్లిచ్చి గెలిపించుకుని పదవులు కూడా ఇస్తుంది. కానీ.. కొద్దికాలంగా కళాకారులు - క్రీడాకారులు బీజేపీపై అసంతృప్తి గళం వినిపిస్తున్నారు. ఆ పార్టీని వీడుతున్నారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంలోనూ కళారంగం - క్రీడారంగం నుంచి వచ్చినవారికి ప్రాతినిధ్యమిచ్చారు. షూటర్ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ - గాయకుడు బాబుల్ సుప్రియోలకు మంత్రి పదవులిచ్చారు. స్మృతి ఇరానీ కూడా ఒకప్పుడు టీవీల్లో ఒక వెలుగు వెలిగిన నటే. వీరే కాకుండా ఎంపీలుగా - వివిధ రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు - మంత్రులుగా కూడా బీజేపీలో పెద్ద సంఖ్యలో కళా - క్రీడారంగాల వారున్నారు. కానీ.. ఇటీవల కాలంలో వారంతా తమ రూటు మారుస్తున్నారు.
ప్రజల్లో పాపులారిటీ ఉన్న నటులు - ఆటగాళ్లు బయటకు వెళ్లడం బీజేపీని కలవరపాటుకు గురిచేస్తోంది. టీ.వీ - సినీ - నాటకరంగాలవారు - క్రికెట్ - హాకీ - ఫుట్ బాల్ - షూటింగ్ వంటి క్రీడలకు సంబంధించిన వారు బిజెపిలో చేరారు. వారు పార్టీ నుంచి వెళ్లిపోవడానికి చేరినంత సమయం కూడా పట్టలేదు. కారణం ఏమిటో తెలీదు గానీ సంబంధిత కళాకారులు - క్రీడాకారులు కొత్త బాటలో వెళుతున్నారు. ఆ మధ్య క్రికెటర్ కీర్తి ఆజాద్ పార్టీమీద తిరుగుబాటు చేస్తే ఈమధ్య మరో క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్దు సొంత పార్టీనే పెట్టుకున్నారు.
బాలీవుడ్ నుంచి వచ్చి బీజేపీ ఎంపీ అయిన వినోద్ ఖన్నా చిరునామా ఇపుడు పార్టీలో కన్పించడం లేదు. మరో హీరో కమ్ విలన్ శత్రృష్ను సిన్షా బీజేపీని విమర్శిస్తూ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ని పొగుడుతున్నారు.
ఏపీలో సంగతో...?
తెలుగులో చోటా హీరో శివాజీ కూడా పార్టీలో చేరి ప్రత్యేక హోదా ఉద్యమంతో బయటకు పోయాడు. పవన్ కళ్యాణ్ కూడా మొన్నటి ఎన్నికల్లో బీజేపీతో కలిసి పనిచేసి ఇప్పుడు వారినే ప్రశ్నిస్తున్నాడు. గతంలో విజయశాంతి కూడా బీజేపీలోనే పనిచేసి బయటకొచ్చేశారు. గతం ఎలా ఉన్నా ఇటీవల ఇలాంటివారంతా ఎందుకు పార్టీని వీడుతున్నారన్న విషయంపై అధిష్ఠానం ఆరా తీస్తోందట. ఏమైనా కళాకారులు, క్రీడాకారులు పార్టీని వీడటం బిజెపికి తీరని నష్టమే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/