టీడీపీ ఫిరాయింపుల మిషన్ లో బీజేపీ నేత కీలకంగా వ్యవహరిస్తుండడంతో మిగతా బీజీపీ నేతలు మండిపడుతున్నారు. ఏపీలో సొంతంగా ఎదగాలని తామంతా ప్రయత్నిస్తుంటే ఆయన వెళ్లి టీడీపీ కోసం వైసీపీ ఎమ్మెల్యేలను బేరమాడి తెస్తున్నారని విరుచుకుపడుతున్నారు.
ఏపీలో చంద్రబాబు మంత్రివర్గంలో ఉన్న బీజేపీ నేత కామినేని శ్రీనివాస్ మొదటి నుంచి చంద్రబాబుకు కరడుగట్టిన మద్దతుదారు. బీజేపీ నేతలందరికీ ఒక దారయితే, ఆయనది మరో దారి. అయితే... ఇటీవల కాలంలో ఆయన ఏకంగా టీడీపీ నేతలా వ్యవహరిస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అంతేకాదు.... తమ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు ఈ విషయంపై ఫిర్యాదు చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు. చాలాకాలంగా కామినేని తీరుపై ఏపీ బీజేపీ నేతలు గుర్రుగా ఉన్నా వారి కోపం మరింత ఎక్కువ కావడానికి కారణం ఉంది. తాజాగా కామినేని టీడీపీ ఫిరాయింపుల వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించడమే దానికి కారణమట. రీసెంటుగా టీడీపీలో చేరిన కదిరి వైసీపీ ఎమ్మెల్యే చాంద్ భాషా చేరిక వెనుక కామినేని హ్యాండ్ ఉందని చెబుతున్నారు. చాంద్ భాషాను టీడీపీలోకి రప్పించడం నుంచి మొదలుపెట్టి.. ఆయన్ను వ్యతిరేకిస్తున్న అనంత టీడీపీ నేతలను బుజ్జగించడం వరకు ప్రతి పనిలో కామినేని ఇన్వాల్వయ్యారట. ఆయనే మొత్తం చక్రం తిప్పారట. దీంతో కమలనాథులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. అమిత్ షాను కలిసి కామినేని వ్యవహారంపై ఫిర్యాదు చేయడానికి అంతా రెడీ చేసుకున్నారట.
అయితే... కామినేని మాత్రం ధీమాగానే ఉన్నారని టాక్. వెంకయ్యనాయుడు - చంద్రబాబు నాయుడుల అండ ఉండగా ఏపీ బీజేపీల నేతల ఫిర్యాదులు తననేమీ చేయలేవన్నది ఆయన అభిప్రాయం.