కేసీఆర్ ప్రచారానికే పోలేదు.. ఆర్టీసీ సమ్మె కారణంగా టీఆర్ ఎస్ పై పీకల్లోతు కోపం కార్మికుల్లో ఉంది. వారికి మద్దతుగా ఉద్యోగ - ఉపాధ్యాయులు కూడా వ్యతిరేకమయ్యారు. కేసీఆర్ తీరుతో ప్రజల్లో కూడా వ్యతిరేకత వ్యక్తమవుతుందన్న అంచనాల నేపథ్యంలో హుజూర్ నగర్ లో టీఆర్ ఎస్ ఘనవిజయం కేసీఆర్ కూడా ఊహించనది. అందుకే హుజూర్ నగర్ కృతజ్ఞత సభలో ప్రజలనుద్దేశించి ‘కేసీఆరే రైట్’ అని మీరు ఆశీర్వదించారని.. ఇక ధైర్యంగా ముందుకెళుతానని కేసీఆర్ అంతులేని ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించాడు.
ఇదే హుజూర్ నగర్ లో బీజేపీ దారుణ ఓటమి చవిచూసింది. మూడో స్థానంలో వచ్చిన స్వతంత్ర అభ్యర్థికంటే వెనుకబడి నాలుగో స్థానంలో నిలిచి డిపాజిట్ గల్లంతు చేసుకొని చరిత్రలోనే చూడని ఘోర ఓటమిని దక్కించుకుంది.
ఎంపీ ఎన్నికల్లో నాలుగు సీట్లు గెలవగానే తెలంగాణలో పాగా వేయాలని చూసిన బీజేపీకి ఇప్పుడు ఇంత ప్రతికూల పరిస్థితుల్లోనూ కేసీఆర్ సాధించిన విజయం చూశాక చెక్ పెట్టడం ఎలా అని కమలదళం మల్లగుల్లాలు పడుతున్నారట.
కేసీఆర్ ను దెబ్బకొట్టడానికే హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలనే ఆలోచనకు కేంద్రంలోని పెద్దలు వచ్చినట్టు ఢిల్లీ వర్గాల నుంచి సమాచారం లీక్ అవుతోంది. ఇలా చేస్తే కేసీఆర్ ను కంట్రోల్ చేసి.. ఆయనకు ఆర్థిక వనరులు లేకుండా చేసి వ్యతిరేకత వ్యాపింపచేసి తెలంగాణలో అధికారం కొల్లగొట్టాలని బీజేపీ స్కెచ్ గీస్తున్నట్టు సమాచారం. తెలంగాణకు ప్రధాన ఆదాయ వనరు హైదరాబాదే. దేశంలోనే మెట్రో పాలిటన్ సిటీ అయిన హైదరాబాద్ నుంచే ఏకంగా 80శాతం ఆదాయం వస్తోంది. హైదరాబాద్ అన్ని రంగాల్లో తెలంగాణకు ఆయువు పట్టుగా ఉంది. ఉపాధి అవకాశాలు - ఐటీ - ఇక్కడే విస్తరించి ఉంది. హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తే ఆ ఆదాయం మొత్తం కేంద్రానికే వెళుతుంది. హైదరాబాద్ లేని తెలంగాణకు అస్సలు ఆదాయం ఉండదు. లోటు బడ్జెట్ లోకి పడిపోతుంది. ఇక సీమాంధ్రుల వ్యాపారాలు - పెట్టుబడులు - ఆస్తులు అన్నీ హైదరాబాద్ లోనే ఉన్నాయి. పోయినసారి టీడీపీ పెట్టుబడుదారులను బెదిరించే కేసీఆర్ ఏపీ ఎన్నికల్లో జగన్ కు మేలు చేశారనే ఆరోపణలు టీడీపీ నుంచి వచ్చాయి.
ఈ నేపథ్యంలో కేసీఆర్ ను దెబ్బకొట్టి తెలంగాణలో అధికారం కొల్లగొట్టాలంటే కేవలం ఆయనను అష్టదిగ్భంధనం చేసి పాలనలో వైఫల్యం చేసి ప్రత్యమ్మాయంగా బీజేపీ ఎదగాలని భావిస్తోంది. ఇందుకోసం హైదరాబాద్ యూటీ ప్రతిపాదనను బీజేపీ పెద్దలు తెరపైకి తెస్తున్నట్టు తెలుస్తోంది.