కమ్యూనిస్ట్ లకు.. కమలనాథులకు మధ్య నడస్తున్న మాటల దాడి ఏ స్థాయిలో ఉందో చెప్పాల్సిన అవసరం లేదు. జేఎన్ యూ విద్యార్థి కన్నయ్య ఇష్యూలో ఈ రెండు పార్టీల మధ్య నెలకొన్న మాటల మంటలు ఇప్పుడు మరింత ముదిరాయి. భారతమాతా కీ జై అంటే కొడుతున్నారని.. ఇదేనా కమ్యూనిస్ట్ లకు ఉన్న దేశభక్తి అని ప్రశ్నిస్తున్న బీజేపీ నేతలు.. ఈ మధ్యకాలంలో సీపీఐ సీనియర్ నేత నారాయణ చేస్తున్న వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తాజాగా నారాయణ మాట్లాడుతూ.. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఫ్యాంట్లలో రావాలని.. ఆయన కానీ పంచెలో వస్తే.. పంచె విప్పదీసి జనాలు కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారంటూ నోరు పారేసుకోవటం తెలిసిందే. తమ అగ్రనేతల్లో ఒకరైన వెంకయ్యపై ఈ స్థాయిలో విరుచుకుపడిన నారాయణపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
ఈ నేపథ్యంలో బీజేపీ క్రమశిక్షణ సంఘం కన్వీనర్ లక్ష్మీపతి తాజాగా మాట్లాడుతూ.. సీపీఐ నారాయణపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. నారాయణకు ఏళ్లుగా ఉన్న పిచ్చి ముదిరి.. ఆయనను బఫూన్ లా మార్చిందని మండిపడ్డారు. రాష్ట్రానికి పెద్దదిక్కుగా వ్యవహరిస్తున్న వెంకయ్యను పంచెలూడదీసి కొడతామని చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావించిన ఆయన.. నారాయణలో పేరుకుపోయిందని విరుచుకుపడ్డారు. మామూలుగానే నోరుపారేసుకునే నారాయణ.. తనను పిచ్చి ముదిరి బఫూన్ మాదిరి మారిందంటూ మండిపడ్డ కమలనాథులపై కామ్రేడ్ కామ్ గా ఉండే అవకాశం ఉందా?