కేసీఆర్ కేబినెట్‌ లో క‌మ‌ళ‌ద‌ళం

Update: 2016-04-06 04:46 GMT
 రాజ‌కీయాల్లో శాశ్వ‌త మిత్రులు.. శాశ్వ‌త శ‌త్రువుల ఉండ‌రు అన్న నానుడిని తెలుగు రాష్ట్రాల నేత‌లు అక్ష‌రాలా నిజం చేస్తున్నారు. తెలంగాణ‌లో అధికార టీఆర్ ఎస్ దెబ్బ‌కు టీడీపీ - వైకాపా ఆల్‌ మోస్ట్ అవ‌సాన ద‌శ‌కు చేరుకున్నాయి. ఈ రెండు పార్టీల నుంచి గెలిచిన ప్ర‌జా ప్ర‌తినిధుల్లో 90 శాతం వ‌ర‌కు ఇప్ప‌టికే కారెక్కేశారు. ఇక కాంగ్రెస్ నుంచి గెలిచిన నేత‌లు కూడా ప‌లువురు ఇప్ప‌టికే గూలాబి గూటికి చేరుకున్నారు. ఇప్పుడు ఏపీలోను ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ జోరుగా సాగుతోంది. ఇదిలా ఉంటే తెలంగాణ‌లో టీడీపీకి చెందిన ప‌లువురు ప్ర‌జా ప్ర‌తినిధుల‌ను త‌మ పార్టీలో చేర్చుకున్న కేసీఆర్ వారికి మంత్రి ప‌ద‌వులు కూడా కేటాయించారు.

ఇక అక్క‌డ ఇప్ప‌టి వ‌ర‌కు మిత్రులుగా ఉన్న టీడీపీ-బీజేపీ బంధం త్వ‌ర‌లోనే బ్రేక‌ప్ అవుతుంద‌న్న టాక్ కూడా వ‌స్తోంది. తెలంగాణ‌లో టీడీపీతో ఉంటే తాము కూడా న‌ష్ట‌పోతామ‌ని బీజేపీ భావిస్తోంది. దీంతో టీడీపీ-బీజేపీ పొత్తు కేవ‌లం ఏపీ వ‌ర‌కే ప‌రిమితం కానుందన్న వార్త‌లు కూడా వినిపిస్తున్నాయి. తెలంగాణ‌లో అధికారంలో ఉండ‌డంతో పాటు చాలా స్ర్టాంగ్‌గా ఉన్న టీఆర్ ఎస్‌ తో బీజేపీ పొత్తు పెట్టుకుంటుంద‌న్న వార్త‌లు తెలిసిందే.

 ఈ నేప‌థ్యంలో టీఆర్ ఎస్ కేంద్రంలో ఎన్డీయే స‌ర్కార్‌ లో చేరుతుంద‌ని....  కేసీఆర్ కూతురు క‌విత‌కు కేంద్ర‌మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌బోతున్నార‌ని స‌మాచారం. క‌విత‌తో పాటు మ‌రో స‌హాయ మంత్రి ప‌ద‌వి కోసం సీనియ‌ర్లు జితేంద‌ర్‌ రెడ్డి - వినోద్‌ కుమార్ రేసులో ఉన్నారు. ఇక కేంద్రంలో టీఆర్ ఎస్ ఎంపీల‌కు మంత్రి ప‌ద‌వులు వ‌స్తే రాష్ర్టంలో ఇద్ద‌రు బీజేపీ నేత‌ల‌కు మంత్రి ప‌ద‌వులు ల‌భించవ‌చ్చ‌ని తెలుస్తోంది. ఈ రేసులో బీజేపీ సీనియ‌ర్ నేత ల‌క్ష్మ‌ణ్ - బీజేపీ రాష్ర్ట అధ్య‌క్షుడు కిష‌న్‌ రెడ్డి - ఎమ్మెల్సీ రాంచంద్ర‌రావు త‌దిత‌రులు ఉన్నారు.
Tags:    

Similar News