సంక్రాంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీకి తెలుగు వారి ఆత్మీయ రుచులు అందనున్నాయి. మోడీ అమితంగా ఇష్టపడే పూతరేకులను సంక్రాంతి కానుకగా పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం భారతీయ జనతా పార్టీ నేతలు ఆయనకు అందించనున్నారు. రాష్ట్ర పార్టీ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న పురిగెళ్ళ రఘురాం ఇప్పటికే వీటిని
తయారుచేయించి ఢిల్లీకి తీసుకువెళ్లారు.
నెయ్యి - జీడిపప్పు - బెల్లం - హార్లిక్స్ తో వీటిని సాంప్రదాయబద్దంగా తయారుచేయించారు. పూతరేకులతో పాటు రాజులడ్డూ - అరిసెలను ప్రధానికి అందించేందుకు తీసుకువెళ్లారు. ప్రధాన మంత్రి నరేంద్రమోడీతో పాటు పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా - బీజేపీ అగ్రనేత అద్వానీ - కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్ - నితిన్ గడ్కారీలకు వీటిని అందివ్వనున్నారు. ఇదిలా ఉండగా ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆంధ్రప్రదేశ్ కు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ రైతాంగానికి ఎంతో అవసరమైన పోలవరం ప్రాజెక్టుకు భారీగా నిధులు ఇవ్వడం, కేంద్ర విద్యాసంస్థలు ఏర్పాటుచేయడం, సాగరమాలలో మరింత ప్రాధాన్యత ఇచ్చినందుకు ఈ రకంగా కృతజ్ఞత తెలిపేందుకు సిద్ధమయ్యారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/