ఏంటేంటి.. ఆ ఒక్క జిల్లా లో బ‌ల‌ప‌డితే.. అధికారంలోకి వ‌చ్చేస్తారా?

Update: 2023-01-21 23:30 GMT
తెలంగాణ‌లో  అధికారంలోకి వ‌చ్చేందుకు 33 జిల్లాల్లోనూ పార్టీని ముందుండి న‌డిపించాల్సిన బాధ్యత బీజేపీకి ఉంది. అయితే.. ఇత‌ర జిల్లాల‌ను ప‌క్క‌న పెట్టిన పార్టీ.. పాల‌మూరును ప్రామాణికంగా తీసుకున్న‌ట్టు క‌నిపిస్తోంది.

ఈ జిల్లాలో పార్టీని బ‌లోపేతం చేస్తే.. చాలు రాష్ట్రంలో అధికారంలోకి వ‌చ్చేందుకు మార్గం సుగ‌మ‌మైన‌ట్టేన‌ని క‌మ‌ల నాథులు భావిస్తున్నార‌ట‌. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున క‌స‌ర‌త్తు ను కూడా ముమ్మ‌రం చేసిన‌ట్టు తెలుస్తోంది.

పాలమూరు ఉమ్మడి జిల్లాపై బీజేపీ నేత‌లు దృష్టి పెట్టారు. త్వ‌ర‌లోనే ఇక్క‌డ‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.  పార్టీ రాష్ట్ర స్థాయిలో తీసుకునే కార్యాచరణతో పాటు ఉమ్మడి జిల్లాలో కీలకమైన ఇరిగేషన్‌, పరిశ్రమల ఏర్పాటు, బీఆర్ఎస్‌ హామీలు అమలు చేయకపోవడం వంటి సమస్యలను గుర్తించి వాటిపై క్షేత్రస్థాయి పోరాటాలు, ఉద్యమాలకు శ్రీకారం చుట్టాల‌ని నిర్ణ‌యించారు.

పాలమూరులో మెజారిటీ స్థానాల్లో గెల‌వాల‌నేది బీజేపీ నేత‌ల వ్యూహంగా ఉంది.ఒకవైపు రాజకీయ కార్యాచరణ అమలు చేయడంతో పాటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అమ‌లు చేస్తున్న‌ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ప్రధానంగా ఇటీవల పనులు పూర్తయిన మహబూబ్‌నగర్‌- సికింద్రాబాద్‌ రైల్వే డబ్లింగ్‌ అంశాన్ని తెరమీదకు తెస్తున్నారు.

అదేవిధంగా మహబూబ్‌నగర్‌-చించోళి మధ్య 102 కిలో మీటర్ల జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్ర వెయ్యి కోట్ల నిధులు ఇచ్చిన విష‌యాన్ని ప్ర‌చారం చేయ‌నున్నారు.ఈ రోడ్డు మంజూరుకు తామే కృషి చేశామంటే, తామే కృషి చేశామని ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధుల మధ్య మాటల యుద్ధం సాగుతున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టు రాజకీయ అస్త్రంగా మారనుంది.

మొత్తంగా పాల‌మూరు జిల్లాల‌పై బీజేపీ వ్యూహం ఓ రేంజ్‌లో ఉంద‌నే వాద‌న వినిపిస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News