జనసేనాని పవన్ కల్యాణ్ ను మరోసారి టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు వైసీపీ అభిమానులు మరియు కీలక నాయకులు. దీంతో మళ్లీ వివాదం రాజుకోనుంది. మాటల యుద్ధం మరింత తీవ్రం కానుంది. ఇప్పటికే పొత్తుల విషయమై 3 ఆప్షన్లను పవన్ ప్రకటించిన విషయం విధితమే ! అదేవిధంగా ఢిల్లీ పెద్దలతో సంప్రతింపులు కూడా జరిగాయి.
అయితే వీటిపై ఎటువంటి స్పష్టతా ఇప్పటికింకా రాలేదు. బీజేపీకి, జనసేనకు ఓవైపు మాటామంతీ జరుగుతుండగా మంత్రి వర్గంలో కీలకంగా ఉన్న కాకాణి గోవర్థన్ రెడ్డి (నెల్లూరు పెద్దాయన, వ్యవసాయ శాఖ మంత్రి) మాటల దాడిని షురూ చేశారు. చంద్రబాబుతో పవన్ కు ప్యాకేజీ కుదిరిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అదేవిధంగా లోకేశ్ ను ఉద్దేశించి కూడా కొన్ని నిర్హేతుక వ్యాఖ్యలు చేశారు. ఇవి కూడా ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. టెన్త్ కూడా పాస్ అవ్వని లోకేశ్ పది తప్పిన విద్యార్థులతో మాట్లాడుతున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు వెల్లడించి టీడీపీ ఆగ్రహానికి గురయ్యారు.
మరి లోకేష్ టెన్త్ పాస్ కాలేదని ఆయనకెవరు రాంగ్ ఇన్ఫో ఇచ్చారో మరి? ఇదే సందర్భంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ (ఒంగోలు ఎమ్మెల్యే, వివాదాస్పద నేత) ఈయన కూడా సీన్లోకి వచ్చారు. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే పవన్ ఎన్నటికీ సీఎం కాలేరని తేల్చేశారు. తనను సీఎం చేయాలని ఆ రెండు పార్టీలనూ (బీజేపీ మరియు టీడీపీ) కోరుతున్నారని కానీ వారు సానుకూలంగా స్పందించడం లేదని తేల్చేశారు.
గత కొంత కాలంగా సైలెంట్ గా ఉన్న బాలినేని కానీ కాకాణి కానీ మరోసారి సీన్లోకి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే జనసేనను తమదైన శైలిలో ఇరకాటంలో ఉంచి, రాజకీయంగా లబ్ధి పొందాలను కోవడమే అని కొందరు పరిశీలకులు అంటున్నారు. వ్యవసాయ శాఖ బాధ్యతలు చూసే మంత్రి రుణమాఫీ పై కానీ, విత్తన రాయితీపై కానీ సాగునీటి ప్రాజెక్టులపై కానీ మాట్లాడితే బాగుంటుందని అంటోంది జనసేన.
ముఖ్యంగా కోనసీమ రైతాంగం పంట విరామం ప్రకటించేందుకు సిద్ధం అవుతున్నందున ఈ వైఫల్యం పాలక ప్రభుత్వం దేనని, వాటిపై దృష్టి సారించక తమ పొత్తులపై వ్యవసాయ శాఖ మంత్రి ఎందుకని అతిగా స్పందిస్తున్నారని జనసేన సోషల్ మీడియా వింగ్ స్పందిస్తోంది.